భారతీయుల నల్లధనం ఖాతాల వివారాలు ఇవ్వలేం..

  • Published - 02:08 PM, Mon - 23 December 19
భారతీయుల నల్లధనం ఖాతాల వివారాలు ఇవ్వలేం..

భారతీయులు స్విస్‌ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనం తాలుకు బ్యాంకు ఖాతాల వివరాలు సమాచార హక్కు చట్టం కింద ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. PTI (ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా) వార్త సంస్థకి చెందిన ఓ విలేకరి సమాచార హక్కు చట్టం కింద కేంద్ర ఆర్ధిక శాఖకి దరఖాస్తు చేసుకోగా, కేంద్ర ఆర్ధిక శాఖ స్విస్ బ్యాంకు ఖాతాల వివారాలు ఇవ్వడం కుదరదని ఆర్టిఐ దరఖాస్తు కి సమాధానం ఇచ్చింది.

అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన నల్లధనం వివరాలు కూడా ఇవ్వలేమని పేర్కొంది. అలాగే గోప్యంగా ఉంచాలన్న నిబంధనతో స్విట్జర్లాండ్‌తో భారత ప్రభుత్వానికి కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ఈ వివరాలు ఇవ్వలేమని పేర్కొంది.

‘‘రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సంబంధిత సమాచారం గోప్యంగా ఉంచాల్సి ఉంది. కాబట్టి పన్ను సంబంధిత వివరాలు, ఇతర దేశ ప్రభుత్వాల నుంచి వచ్చిన వివరాలు ఆర్‌టీఐలోని 8(1) ఏ, 8(1) (ఎఫ్‌) కింద మినహాయింపు ఉంది’’ అని ఆర్థిక శాఖ సమాధానం ఇచ్చింది.

నల్లధనం దాచుకునేందుకు స్విస్‌ బ్యాంకులు స్వర్గధామంగా మారాయన్న ఆరోపణల నేపథ్యంలో అక్కడి స్విట్జర్లాండ్ ప్రభుత్వం నల్లధనం వెలికితీతకు చర్యలు తీసుకుంది. భారత్‌ సహా 75 దేశాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకునే విధంగా స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి చెందిన ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (FTA) తో ఒప్పందం కుదుర్చుకుంది.

దీనికి సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్‌లో అక్కడి ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి తొలి విడతగా కొన్ని బ్యాంకు ఖాతాలకి సంభందించిన సమాచారం భారత్‌కు చేరింది. ఇందులో మూసివేసిన ఖాతాల సమాచారమే ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

దీనికి కారణం లేకపోలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల నుండి వస్తున్న ఒత్తిళ్లు దాటికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం తలొగ్గి తమ బ్యాంకుల్లొని ఖాతాదారుల వ్యక్తిగత వివారాలు ఇవ్వడానికి సంసిద్దత వ్యక్తం చేసింది. అప్పటివరకు నల్ల ధనం కుబేరులకు తమ సంపద దాచుకొవడానికి స్వర్గధామంగా ఉన్న స్విట్జర్లాండ్ బ్యాంకులు తమ ఖాతాదారుల వ్యక్తిగత వివారాలు విషయంలో చాలా గొప్యత పాటించేవి. ఈ పరిణామంతో నల్లధనం కుబెరులంతా తమ ఖాతాలను క్లోజ్ చేశారు.

గతంలో 2011లో UPA ప్రభుత్వం నియమించిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్ (NCAER) అధ్యయనం ప్రకారం 1980-2010 మధ్య భారతీయులకు చెందిన నల్లధనం 384 -470 అమెరికన్ బిలియన్ డాలర్ల నల్లధనం ( భారత కరెన్సీ ప్రకారం స్విస్ బ్యాంకుల్లో ఉన్నట్టు తేలింది. 1997-2009 మద్య మొత్తం దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలొ 0.2% – 7.4% శాతం సంపద స్విస్ బ్యాంకులకు ప్రవహించినట్టు ఒక అంచనా.

Show comments