iDreamPost
android-app
ios-app

సారా టెండూల్కర్ ను వ‌దిలేసి శుభమాన్ గిల్ సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నాడా?

  • Published Aug 30, 2022 | 1:36 PM Updated Updated Aug 30, 2022 | 1:36 PM
  • Published Aug 30, 2022 | 1:36 PMUpdated Aug 30, 2022 | 1:36 PM
సారా టెండూల్కర్ ను వ‌దిలేసి శుభమాన్ గిల్ సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నాడా?

స‌చిన్ టెండూల్క‌ర్ కూతురితో విడిపోయిన తర్వాత శుభమాన్ గిల్ , సారా అలీ ఖాన్ డేటింగ్ చేస్తున్నారా? ఈ జంట కలిసి డిన్నర్ చేసిన‌ ఫోటో వైరల్ అయ్యింది.

ఈ ఫోటో చూసిన త‌ర్వాత ఇంకా ఏం చెప్పాలి? క్రికెటర్ శుభ్‌మన్ గిల్ , సారా అలీ ఖాన్ కలిసి డిన్నర్‌లో కనిపించిన ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్. గిల్ ఆట‌లోనేకాదు డేటింగ్ లోనూ దూకుడు చూపిస్తాడ‌ని నెటిజెన్స్ అంటున్నారు. సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో కొద్దికాలం క్రితం విడిపోయాడని ముంబై మీడియా తెగ రాసింది.

అంత‌లోనే బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌తో అతని ఫోటోతో మ‌ళ్లీ కొత్త‌ డేటింగ్ పుకార్లు మొద‌లైయ్యాయి. ఇద్ద‌రి అమ్మాయిల మొదటి పేరు సారానే. అందుకే ఇంటర్నెట్‌లో గిల్ ను ఏడిపిస్తూ మీమ్‌లు పోస్ట్ అవుతున్నాయి. ఇంత‌కీ సారా ఆలీ ఖాన్ తో క్యాజువల్ డిన్నరేనా? వీరిద్దరి మధ్య ఏదైనా సమ్ థింగ్ ఉందా? అభిమానులు ఆరాలు తీస్తున్నారు.

సారా అలీఖాన్ పేరు ఇంతకు ముందు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో లింక్ అయింది. సారా- సుశాంత్ చాలా ప్రేమలో ఉన్నారని గాసిప్స్ వినిపించాయి. సారా కుటుంబానికి సుశాంత్‌తో ఆమె రిలేషన్‌షిప్ న‌చ్చ‌లేదు. విడిచిపెట్ట‌మ‌ని డైరెక్ట్ గానే చెప్పింది. కరీనా కపూర్ ఖాన్ ఇంటర్వ్యూలో అలాంటి స‌ల‌హానే ఇచ్చింది. తన కో స్టార్ తో డేటింగ్ చేయవద్దని సారాకు చెబుతాన‌ని బెబో చెప్పింది. ఆ క‌థ అక్క‌డితో ముగిసిపోయింది. లేటెస్ట్ గా కరణ్ జోహార్ ఒక గాసిప్ చెప్పాడు. సారా , కార్తీక్ ఆర్యన్ ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారని క‌న్ఫ‌ర్మ్ చేశాడు. కాని ఈ ఇద్ద‌రూ విడిపోయారు. కాఫీ విత్ కరణ్ 7లో, సారా కొత్త ప్రేమ‌పురాణం మొద‌లైన‌ట్లే అనిపించింది. విజయ్ దేవరకొండపై క్ర‌ష్ ఉంద‌ని చెప్పింది. లైగ‌ర్ హిట్ కొడితే ఈ క్ర‌ష్ కాస్తా డేటింగ్ వ‌ర‌కు వెళ్లేదేమో. అంత‌లోనే గిల్ తో పుకార్లు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaymavi girişgrandpashabet