iDreamPost
iDreamPost
ఇండియన్ సినిమాలో ఇంటింటికి తెలిసిన ముఖం, బాహుబలితో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాజర్, ఆరోగ్య కారణాలతో సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు. కరోనా సోకినప్పుడు ఆయన గుండె సమస్యలతో బాధపడ్డాడు. అందుకే నటన నుంచి విరామం తీసుకోవాలకుంటున్నారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, నాజర్ తాను సినిమా ఫీల్డ్‌కు దూరమవుతున్నట్లు చెప్పారు.
సినిమాల్లోకి రాకముందే నాజర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేశాడు. తరువాత అతను నటనపై ఆసక్తిని పెంచుకున్నారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ , తమిళనాడు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ టెక్నాలజీస్ లో ట్రయినింగ్ తీసుకున్నారు.
1985లో K. బాలచందర్ డైరెక్షన్ లో ‘కళ్యాణ అగతిగళ్’తో సినిమాల్లోకి వచ్చారు. మణిరత్నం క్లాసిక్ సినిమా ‘నాయకన్’(1987)లో అతని మంచి పాత్ర దక్కింది. అందులో నాజర్ పోలీసు అధికారి. కమల్ హాసన్ తో పోటీగా నటించారు. అక్కడ నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు , హిందీ సినిమాల్లో ఆయన పదుల కొద్ది పాత్రల్లో నటించారు. నిజానికి ఆయన వచ్చింది హీరో కావడంకోసం. కొన్నిసినిమాల్లో ఆయనే కథానాయకుడు. ఆ తర్వాత విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన గొప్పగా రాణించారు. లీడింగ్ డైరెక్టర్లందరికీ ఆయన కావాల్సిన నటుడు.
నాజర్ మంచి డైరెక్టర్ కూడా. మొత్తం మీద 5 సినిమాలకు ఆయన డైరెక్షన్ చేశారు. Avatharam , Devathai, Maayan, Pop Corn(2003), Sun Sun Thatha (2012)సినిమాలను క్రిటిక్స్ మెచ్చుకున్నారు.