iDreamPost
android-app
ios-app

మాతృదేవోభవ సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

1993లో ప్రేక్షకులను సెంటిమెంట్ తో కంటతడి పెట్టించిన చిత్రం మాతృదేవోభవ. ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధవి, నాజర్ హీరో హీరోయిన్లు. అప్పట్లో ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇందులో ఈ దంపతులకు కుమార్తెగా నటించిన పాప గుర్తుందా..?

1993లో ప్రేక్షకులను సెంటిమెంట్ తో కంటతడి పెట్టించిన చిత్రం మాతృదేవోభవ. ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధవి, నాజర్ హీరో హీరోయిన్లు. అప్పట్లో ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇందులో ఈ దంపతులకు కుమార్తెగా నటించిన పాప గుర్తుందా..?

మాతృదేవోభవ సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

గ్లామరస్ పాత్రలతో అలరించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధవి.. తన కెరీర్ ఎండింగ్‌లో నటించి, ఏడ్పించిన చిత్రం మాతృదేవోభవ. 1993లో వచ్చిన ఈ సినిమాను చూసి కంటతడి పెట్టిన మహిళే కాదు.. పురుషుడు కూడా లేడంటే అతిశయోక్తి కాదు. సినిమా చూస్తుంటే కర్చీఫ్‌లు తడిసిపోవాల్సిందే. మహిళలు చీర చెంగులతో కన్నీటిని తుడుచుకునేవారు. అంతలా ఏడ్చించింది ఈ మూవీ. ఇది మలయాళ సినిమా ఆకాశ దూత్‌కు రీమేక్. అక్కడ హిట్ అందుకోవడంతో తెలుగులో కూడా తెరకెక్కించారు. కన్నడ, హిందీ, మరాఠి భాషల్లోనూ రీమేక్ చేశారు. అన్ని చోట్ల కమర్షియల్ హిట్ కొట్టింది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కే ఎస్ రామారావు తెలుగులో నిర్మించారు. కె. అజయ్ కుమార్ దర్శకుడు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందించారు.

సినిమానే కాదు.. పాటలు కూడా గుండెను బరువెక్కించేస్తుంటాయి. వేటూరి సుందర్ రామ్మూర్తి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకో పాటకు జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకుంది. ఇదే కాదు వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతానికి గగానికి అంటూ సాగే పాట కూడా కన్నీరు పెట్టిస్తుంది. మాధవి నటనకు మంత్ర ముగ్దులు అయిపోతారు. నాజర్ ఆమెకు భర్తగా నటించారు. చారు హాసన్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, వై విజయ్ కీలక పాత్రలు పోషించారు. ఇక కథ విషయానికి వస్తే.. మాధవి, నాజర్ భార్యా భర్తలు. వీరికి నలుగురు చిన్నారులు. ఓ పాప, ముగ్గురు మగ పిల్లలు ఉంటారు. అందంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి పెను దుమారం రేపుతుంది క్యాన్సర్. మాధవికి క్యాన్సర్ అని తెలిసి కుంగిపోతుంది ఆమె కుటుంబం. భర్త కూడా తాగుడు మానేసి..కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటాడు.

అంతలో భర్త నాజర్ చనిపోతాడు. తాను కూడా చనిపోతానని తెలిసి.. తన బిడ్డలను అనాధలు చేయకూడదని, తన నలుగురు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లి పడే తపన, ఆరాటమే ఈ మాతృదేవోభవ. ఈ సినిమాలో నాజర్, మాధవిల కుమార్తెగా నటించిన బేబీ గుర్తుందా. తల్లిని విడిచి పెట్టి ఉండలేక.. అమ్మ చనిపోతుందని తెలిసి.. దత్తత వెళుతుంది. రాధ పాత్రలో ఎంతో పరిణీతితో నటిస్తుంది ఈ చిన్నారి. ఆ పాప ఎవరు.. ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా…? ఆ పాప పేరు సీనా ఆంటోనీ. సీనా మలయాళంలో ఆకాశ దూత్ సినిమాలో నటించింది. అందులో ఆమె నటనను చూసిన దర్శకుడు.. తెలుగులో ఆ పాత్ర ఆమెకే ఇచ్చాడు. సీనా ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. మలయాళంలో మమ్ముట్టితో హిట్లర్ మూవీలో ఓ చెల్లెలిగా నటించింది. పలు సినిమాల్లో చేసి సీరియల్స్ వైపు మళ్లింది. ఆమె ఓ వ్యాపార వేత్తను పెళ్లాడింది. తాజాగా మలయాళంలో ఆమె సీతాయానం అనే సీరియల్ చేసింది. అప్పటికి.. ఇప్పటికీ ఆమెలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రస్తుతం బుల్లితెరపై రాణిస్తుంది ఈ నటి.