Arjun Suravaram
Arjun Suravaram
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఓ అంశం పెను దుమారం రేపుతోంది. ప్రతిపక్షలు సైతం ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. అదేనండి ఇండియా పేరును భారత్ గా మార్చనున్నట్లు వస్తున్న ఊహాగానాలు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం.. మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చేందుకు సిద్ధమైందనే ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి..దీనికి సంబంధించిన బిల్లును ఆమోదించనున్నట్లు సమాచారం. దేశం పేరు మార్పుకు కొందరు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈక్రమంలోనే దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే మన దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చాలంటే వేల కోట్లు ఖర్చ అవుతుందంట. మరి.. ఆ ఖర్చు ఎంత?. ఆ ఖర్చును ఎలా లెక్కిస్తారు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
జి-20 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఆయా దేశాల నేతలకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేరు మీద ఆహ్వాన పత్రాలు పంపించారు. ఆ పత్రాల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు భారత్ అని ముద్రించగా… పేరు మార్పు అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో దేశం పేరు మారుస్తున్నారని అంతా చర్చించుకుంటున్నారు. ఎవరికి నచ్చిన విధంగా వారు ఈ అంశంపై మాట్లాడుతున్నారు. అయితే తాజాగా దేశం పేరు మార్పుకు సంబంధించి ఓ కొత్త విషయం తెలిసింది. దేశం పేరు మార్చడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదంట.
గత చరిత్రలు, పలు దేశాల అనుభవాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. దక్షిణాఫ్రికాకు చెందిన న్యాయవాది, బ్లాగర్ డారెన్ ఒలివర్ మెడల్ బట్టి.. ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు అయ్యే ఖర్చు రూ. 14 వేల కోట్లకుపైనే ఉంటుందంట. న్యూస్ అవుట్‌లెట్ అవుట్‌లుక్ దీనిని నివేదించింది.2018లో ఆఫ్రికా ఖండంలోని స్వాజిలాండ్ అనేద దేశం ఎస్వాతిని అని పేరు మార్చుకుంది. దీనికి అయ్యే ఖర్చును ఒలీవర్ ఈ మోడల్ ఆధారంగా లెక్కించి 60 మిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు. దేశం పేరు మార్చడాన్ని.. పెద్ద పెద్ద సంస్థల రీబ్రాండింగ్ ఎక్సర్‌సైజ్‌లతో పోల్చారు. ఒలీవర్ మోడల్ ప్రకారం.. ఏదైనా ఒక పెద్ద సంస్థ లేదా దేశం మొత్తం రెవెన్యూలో మార్కెటింగ్ ఖర్చులు 6 శాతంగా ఉంటుందని అంచానా వేశారు.
అయితే దాని రీబ్రాండింగ్ కోసం మొత్తం మార్కెటింగ్ బడ్జెట్ నుంచి 10 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా చూసినట్లు అయితే భారత్ కూ దాదాపు 14 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఎలాగంటే.. 2023, మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం ఆదాయం రూ.23.84 లక్షల కోట్లు. ఒలీవర్ మోడల్ ప్రకారం.. రీబ్రాండింగ్ కోసం అందులో 10 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన మొత్తం రూ. 14,304 కోట్లు అవుతుంది. ఈ ఖర్చు.. భారత్.. ప్రతి నెలా ఆహార భద్రతా పథకం కోసం వినియోగిస్తున్నదాని కంటే ఎక్కువ కావడం విశేషం. మరి.. దేశం మార్పుకు అవుతున్న ఖర్చుపై న్యూస్ అవుట్‌లెట్ అవుట్‌లుక్ ఇచ్చిన నివేదికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.