ఇటీవలే మూడు వన్ డే ల సిరీస్ కోల్పోయిన భారత్ కు న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో కూడా కష్టాలు తప్పడం లేదు..101 పరుగులకే ఐదు ప్రధాన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్, నాలుగో ఓవర్ లోనే సౌతీ భారత ఓపెనర్ పృథ్వీ షా ను క్లీన్ బౌల్డ్ చేయడంతో వికెట్ల పతనం మొదలైంది.. సరైన భాగస్వామ్యం నిర్మించకుండానే పుజారా, కోహ్లీ వెనుతిరగడంతో భారత్ ఒత్తిడిలో పడింది.. క్రీజులో కుదురుకుంటున్న మయాంక్ అగర్వాల్(34) ను బౌల్ట్ బోల్తా కొట్టించడంతో 101 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది.
జేమీసన్ కి 3 వికెట్లు దక్కగ, సౌతీ, బౌల్ట్ చెరో వికెట్ సాధించారు..రహానే 38 పరుగులతో, రిషబ్ పంత్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.. వీరిద్దరూ భారీ భాగస్వామ్యం నిర్మిస్తే తప్ప భారత్ రేసులోకి రావడం కష్టమే.. దీంతో మొదటి సెషన్ ఆటలో న్యూజిలాండ్ ఆధిపత్యమే నడిచింది.. కోహ్లీ, పుజారా, పృథ్వీ షా, విహరీ విఫలమయ్యారు..టీ బ్రేక్ సమయానికి 122 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది భారత జట్టు…