iDreamPost
android-app
ios-app

Crime News: ప్రియుడితో కలిసి భర్తను చంపి, దృశ్యం సినిమా చూపించింది

  • Published Jul 08, 2022 | 12:58 PM Updated Updated Jul 08, 2022 | 12:58 PM
  • Published Jul 08, 2022 | 12:58 PMUpdated Jul 08, 2022 | 12:58 PM
Crime News: ప్రియుడితో కలిసి భర్తను చంపి, దృశ్యం  సినిమా చూపించింది

ఒక అమ్మాయికి వివాహేత‌ర సంబంధ‌ముంది. ప్రియుడితో కలిసి భర్తను చంపి, వాళ్లు ప‌నిచేస్తున్న చోటే పాతిపెట్టింది. అక్క‌డ నుంచి డ్రామా మొద‌లైంది. బావ‌కి ఫోన్‌ చేసి అక్కడికి వచ్చాడా అని ఆరా తీసింది. ఆ త‌ర్వాత అత్తారింటికి వెళ్లింది. ఏదీ మా కొడుకు అని అడిగితే ఎక్క‌డ‌కు వెళ్లాడో తెలియ‌ద‌ని చెప్పింది. తానుకూడా భ‌ర్త స్నేహితుల‌కు ఫోన్ చేసింది. ఈ య‌వ్వారం చూసి అనుమానం వచ్చిన అత్త కుంబుం స‌భ్యులు నిలదీస్తే, దారుణం బైట‌కు వ‌చ్చింది. ఇదికామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

కర్ణాటక రాష్ట్రం, బందెంపల్లికి చెందిన ఎరుకల రమేశ్‌(26)కు వికారాబాద్‌ జిల్లా, బషీరాబాద్‌ మండలం, నీలపల్లి గ్రామానికి చెందిన వెన్నెలతో ఎనిమిదేళ్ల క్రితం పెళ్ల‌య్యింది. నాలుగేళ్ల క్రితం పటాన్‌చెరు ప్రాంతంలో కూలీలుగా వ‌చ్చిన‌ప్పుడు, అక్క‌డే గంగపురి దస్తప్పతో వెన్నెలకు వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ సంగ‌తి బైట‌ప‌డ‌టంతో భార్యాభర్తల మధ్య గొడవలు. ఇద్ద‌రూ వారి ఊరుకెళ్లారు. రమేశ్‌ కుటుంబ సభ్యులు ఇద్దరికీ సర్దిచెప్పారు. ఆ త‌ర్వాత‌ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో ఓ ఇంటి నిర్మాణానికి కూలీలుగా వ‌చ్చారు. ఇక్కడే ఉంటున్నారు. ఈలోగా వెన్నెల ప్రియుడు రెండుమూడుసార్లు వచ్చి కలిశాడు.

గతనెల 30న రాత్రి పూట అత‌ను భ‌ర్త‌ రమేశ్‌ కంటపడ్డాడు. అత‌ను గ‌ట్టిగా నిల‌దీస్తుంటే, దస్తప్ప అత‌ని మీదకు వెళ్లాడు. అతడి గొంతును గ‌ట్టిగాప‌ట్టుకొంటే, వెన్నెల కాళ్లు పట్టుకుంది. ఇద్ద‌రూ క‌ల‌సి ర‌మేష్ ను హ‌త్య చేశారు. అక్క‌డే పూడ్చిపెట్టారు. వెన్నెల మరుసటి రోజు రమేశ్‌ అన్న వెంకటప్పకు ఫోన్‌ చేసి, అత‌ను కర్ణాటకకు వచ్చాడని చెప్పింది.

ఆ త‌ర్వాత‌ అత్తగారింటికి వెళ్లింది. అక్క‌డే దారుణం బైట‌ప‌డింది. పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. అ్క‌డే పోస్టుమార్టం చేసి, బంధువులకు అప్పగించారు. పారిపోయిన‌ వెన్నెల, దస్తప్పలకోసం గాలిస్తున్నారు

Jojobet Girişjojobet güncel girişMadridbetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet