iDreamPost
android-app
ios-app

మైనర్‌ బాలుడి ప్రాణం తీసిన ప్రొటీన్‌ డ్రింక్‌.. ఏం జరిగింది అంటే!

  • Published Jun 29, 2023 | 5:07 PMUpdated Jun 29, 2023 | 5:07 PM
  • Published Jun 29, 2023 | 5:07 PMUpdated Jun 29, 2023 | 5:07 PM
మైనర్‌ బాలుడి ప్రాణం తీసిన ప్రొటీన్‌ డ్రింక్‌.. ఏం జరిగింది అంటే!

ఆత్మన్యూనత భావం మనిషి చేత ఎన్ని తప్పులైనా చేయిస్తుంది. ఏ మనిషి పర్ఫెక్ట్‌ కాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. దాన్ని అంగీకరించి ముందుకు సాగితేనే మనిషి జీవితం ఆనందంగా ఉంటుంది. మనలో ఉన్న లోపాన్ని మనం అంగీకరించగలిగితే.. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే.. మనం కుంగిపోం. లేదంటే.. ఆ లోపమే మనల్ని వెంటాడి.. మన జీవితానికి పెను శాపంగా మారుతుంది. ఓ మనిషి జీవితంలోనే కాదు శారీరకంగా ఎదగాలన్న.. ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. ఏది నిమిషాల వ్యవధిలో మారదు. ఈ చిన్న విషయం తెలిసి కూడా చాలా మంది అద్భుతాలు జరగాలని ఆశిస్తారు. మరీ ముఖ్యంగా శరీర బరువు తగ్గించుకోవడం, ఎత్తు పెరగడం, లావు పెరగడం వంటి విషయాల్లో.. ఏమాత్రం ఓపిక వహించరు. టీవీలో వచ్చే మోసపూరిత ప్రకటనలు నమ్మి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ప్రొటీన్‌ డ్రింక్‌ ఓ మైనర్‌ బాలుడి జీవితాన్ని చిదిమేసింది. ఆ వివరాలు…

ఈ విషాదకర సంఘటన మూడేళ్ల క్రితంయూకేలో చోటు చేసుకోగా.. తాజాగా మారోసారి వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల తన కుమారుడు సన్నగా ఉన్నాడని భావించిన అతడి తండ్రి.. కుమారుడి కండలు పెరగడం కోసం ఒక ప్రొటీన్‌ డ్రింక్‌ను తీసుకువచ్చాడు. ఈ డ్రింక్‌ తాగితే కండలు పెరుగుతాయని భావించిన తండ్రి.. కొడుకు చేత దాన్ని తాగించాడు. ఆ తర్వాత బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై మూడు రోజుల తర్వాత చనిపోయాడు. ఈ విషాదకర సంఘటన మూడేళ్ల కిందట యూకేలోని లండన్‌లో జరిగింది. అయితే, సదరు మైనర్‌ బాలుడి మరణానికి ప్రొటీన్ డ్రింక్ కారణమని తాజాగా, వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రొటీన్ డ్రింక్స్‌పై ఆరోగ్య హెచ్చరికలను చేర్చాలని యూకే అధికారులు స్పష్టం చేశారు.

మృతి చెందని మైనర్‌ బాలుడిని భారతీయ సంతతికి చెందిన 16 ఏళ్ల రోహన్ గోధానియాగా గుర్తించారు. మూడేళ్ల క్రితం అనగా.. ఆగస్టు 15, 2020న ప్రొటీన్ షేక్ తాగిన కొద్దిసేపటికే రోహన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రక్తప్రవాహం అధికం కావడం వల్ల కోలుకోలేని విధంగా అతడు మెదడు దెబ్బతినడంతో మూడు రోజుల తర్వాత వెస్ట్ మిడిల్‌సెక్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. బాలుడు మరణించిన వెంటనే అందుకు గల కారణాన్ని ఆస్పత్రి గుర్తించేలోపు.. రోహన్‌ తల్లిదండ్రులు అతడి అవయవాలను తల్లిదండ్రులు దానం చేశారు.

కొడుకు కండలు పెరగడం కోసం రోహన్‌ తండ్రి తీసుసుకవచ్చిన ప్రొటీన్ షేక్ తాగడంతో ఆర్నిథైన్ ట్రాన్స్‌కార్బామైలేస్ లోపంగా పిలిచే అరుదైన జన్యు పరిస్థితి ఏర్పడింది. ఇది కాస్త.. రోహన్ రక్తప్రవాహంలో అమ్మోనియా విచ్ఛిన్నతను ప్రేరేపించింది. చివరకు అది ప్రాణాంతక స్థాయికి చేరుకుందని తెలిసింది. రోహన్‌ మృతికి అరుదైన వ్యాధి ఆర్నిథైన్ ట్రాన్స్‌కార్బామైలేస్‌ కారణమని పోస్ట్‌మార్టంలో ప్రాథమికంగా గుర్తించలేకపోయామని కోర్టు విచారణలో ఇటీవల వివరించినట్టు తెలిపింది.

ఆర్నిథైన్ ట్రాన్స్‌కార్బామైలేస్ అనేది మనిషి శరీరంలోని అమ్మోనియా విచ్ఛిన్నతను ప్రేరేపించడంతో.. రక్తప్రవాహం ప్రాణాంతక స్థాయికి చేరుకుంటుంది. అంతేకాదు, ఇది ప్రోటీన్ తీవ్రతను కూడా ప్రేరేపిస్తుంది. ఈ సందర్భగా యూకేకు చెందిన అధికారి కరోనర్ టామ్ ఓస్బోర్న్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రోటీన్ డ్రింక్స్ గురించి, వాటి గురించి నా ప్రాథమిక అభిప్రాయం ఏమిటంటే ఈ పానీయాల ప్యాకేజింగ్‌పై ఒక విధమైన హెచ్చరికను ఉంచాలని నేను రెగ్యులేటరీ అధికారులకు రాయాల్సిన బాధ్యత నాపై ఉది, ఎందుకంటే ఓటీసీ పరిస్థితి చాలా అరుదు. ఎవరైనా (ఒకటి) తాగితే అది హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది.. అది ప్రోటీన్ స్పైక్‌కు కారణమవుతుంది’’ అని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి