కుక్క బర్త్ డే సెలబ్రేషన్స్ .. 100 కేజీల కేక్.. 4000 మందికి భోజనాలు : కుక్కపై ప్రేమతో కాదంటున్న నెటిజన్లు

పెంపుడు జంతువులకు మనుషులకు మధ్య బంధం ఎనలేనిది. నిజానికి మనుషుల పట్ల మనుషుల కంటే.. జంతువులకే ఎక్కువ ప్రేమ, విశ్వాసం ఉంటాయంటారు. మనుషులు కూడా వాటిపై ఎనలేని ప్రేమను పెంచుకుంటారు. తమ ఇంట్లో మనిషిలాగే ట్రీట్ చేస్తారు. తోడబుట్టిన తమ్ముడు, చెల్లెలు అన్నట్లుగా చూసుకుంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది పెంపుడు జంతువుల పుట్టినరోజులు సెలబ్రేట్ చేస్తున్నారు. అలా కర్ణాటకలో ఓ వ్యక్తి తన ఇంట్లో కుక్క పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేశాడు.

బెళగావిలో ఉండే శివప్ప ఎల్లప్ప మరడి అనే వ్యక్తి తన పెంపుడు కుక్క పుట్టినరోజు వేడుక కోసం ఏకంగా 100 కిలోల కేక్ ను ఆర్డర్ చేసి, కేక్ ను కట్ చేశాడు. ఆ బర్త్ డే పార్టీకి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింద్. క్రిష్ అనే కుక్క.. తన పుట్టినరోజు సందర్భంగా.. తలపై క్యాప్, ఒంటిపై శాలువా కప్పుకుని చాలా అందంగా కనిపించింది. ఈ వేడుకకు వచ్చినవారంతా కుక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. కేక్ తినిపించారు. అనంతరం శివప్ప- క్రిష్ తో కలిసి ఊరేగింపుగా వెళ్లాడు. అనంతరం 4000 మందికి భోజనాలు పెట్టారు.

కానీ.. చాలా మంది ఈ పుట్టినరోజు వేడుకపై పెదవి విరుస్తున్నారు. శివప్ప తన స్టేటస్ ను తెలియజేయడానికే ఈ పార్టీ ఇచ్చారు తప్ప.. పెంపుడు కుక్కపై ఉన్న మమకారంతో కాదని స్పష్టంగా తెలుస్తుందని అంటున్నారు.

 

Show comments