iDreamPost
android-app
ios-app

బాబు కోసం బయటకొస్తే ఫ్రీ మటన్! స్పందన లేక చివరికి!

బాబు కోసం బయటకొస్తే ఫ్రీ మటన్! స్పందన లేక చివరికి!

చట్టం ఎవ్వరికీ చుట్టం కాదని మరోసారి నిరూపితమైంది. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి విదితమే. ఈ కేసులో ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే చంద్రబాబును శనివారం ఉదయం నంద్యాలలో అరెస్టు చేసిన సమయంలో కాస్త హడావుడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, శ్రేణులు.. రోడ్డు మార్గం గుండా విజయవాడ తరలిస్తున్న సమయంలో మాత్రం చడీచప్పుడు చేయలేదు. కార్యకర్తలు రోడ్డు మీదకు రాకపోవడంతో ఆయనకు పూర్తిగా మద్దతు కరువైంది. టీడీపీ అధినేత అరెస్టు అయితే రోడ్లపైకి వచ్చిన నిరసన చేపట్టరా? ప్రజలు బయటకు రాకపోవడంపై టెలీ కాన్ఫరెన్స్‌లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఈ ఆడియో లీక్ అయిన సంగతి విదితమే.

చందబ్రాబును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన తర్వాత.. ఈ చర్యకు వ్యతిరేకంగా సోమవారం బంద్ నిర్వహించారు. దీనికి కూడా ఆదరణ లభించలేదు. రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపేందుకు సామాన్యులే కాదూ.. టీడీపీ నేతలు సైతం ఆసక్తి కనబర్చలేదు. తూతూ మంత్రంగానే బంద్ చేపట్టారు కార్యకర్తలు, టీడీపీ నేతలు. బలవంతంగా జన సమీకరణాలు చేయడం, హడావుడి ఆందోళనలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికా వంటి ప్రాంతాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు టీడీపీ మద్దతుదారులు. అయితే నిరసనలు తెలిపేందుకు ఆసక్తి చూపుతారో లేదో అన్న సందేహంతో ‘ ఫ్రీ మటన్ ఫ్రై, అమరావతి చికెన్ పులావ్’ వంటివి ఆఫర్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మేసేజ్‍లు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటువంటి ఆఫర్లను చూసి పెదవి విరుస్తున్నారు నెటిజన్లు.

TDP NRI dallas messages to party leaders

ఏ పార్టీ తరుఫు నుండైనా బంద్, నిరసలు, సంఘీభావ కార్యక్రమాలు చేపడితే స్వచ్ఛందంగా వస్తుంటారు కార్యకర్తలు. కానీ ఇటువంటి ఆఫర్లను ఎరగా చూపించి ప్రజలను సమీకరించాలనుకోవడం బట్టి చూస్తే పూర్తిగా టీడీపీకి, ఆ పార్టీ అధినేతకు మద్దతు కరువయ్యిందని తెలుస్తోంది. టీడీపీ నేతలు, శ్రేణుల నుండి స్పందన లేకపోవడంతోనే అలా ఆఫర్లు చేసినట్లు సమాచారం. పార్టీ క్యాడర్స్ కూడా రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. ఒకప్పుడు అధికార పక్షం, ప్రస్తుత ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, ప్రస్తుత అధినేతకు ఈ గతి పడుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. దీనిని బట్టి చూస్తే టీడీపీ భవితవ్యంపై  నీలినీడలు కమ్ముకున్నాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి