iDreamPost
iDreamPost
ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, దేశంలోని రాష్ట్రాలు తమ ఆదేశాల తరువాతే ర్యాపిడ్ కిట్లను వినియోగించాలని ఐ.సి.యం.ఆర్ ప్రకటించింది. భారతదేశాన్ని మహమ్మారిలా సోకి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే, సత్వరమే ఫలితాలు ఇచ్చే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్సే మాత్రమే మార్గం అని భావించిన కేంద్ర ప్రభుత్వం రాపిడ్ టెస్టింగ్ కిట్స్ కోసం గతనెలలో ICMR ఆద్వర్యంలో టెండర్లకు ఆహ్వానించి చైనా దక్షిణ కొరియా దేశాలనుండి లక్షలాది ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకుంది. అయితే ICMR కొన్ని రాష్ట్రాలకు ఈ కిట్లను సరఫరా చేసినా కొన్ని రాష్ట్రాలు మాత్రం నేరుగా ఆయా దేశాలనుండి కిట్లను కోనుగోలు చేశాయి.
ICMR దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లలో 30 వేల కిట్లను రాజస్థాన్ కు ఉచితంగా పంపగా రాజస్థాన్ నేరుగా 10వేల కిట్లను కొనుగోలు చేసింది. ఇవన్ని ఆ రాష్ట్రం చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే, జైపూర్ సహా పలు హాట్ స్పాట్లలో ఈ కిట్లను ఉపయోగించి పరీక్షలు నిర్వహించింది . అయితే పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ఈ కిట్లతో పరీక్ష చేయగా ఈ కిట్లలో నెగిటివ్ రావడంతో ఒక్కసారిగా రాజస్థాన్ ప్రభుత్వం ఉలిక్కిపడింది . ఈ కిట్లలో నాణ్యత కచ్చితత్వాన్ని నిర్ధారించడం కోసం రాజస్థాన్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఆద్వర్యంలో పరువురు పై పరీక్షలు నిర్వహించిన అనoతరం కేవలం 5.4% మాత్రమే తమ దగ్గర ఉన్న ఫలితాలతో సరి తూగాయని తేల్చింది. అయితే ఈ నివేదికను ICMR దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ కిట్ల వల్ల ఉపయోగం లేదని చెప్పింది, అలాగే బెంగాల్ ప్రభుత్వం కూడా ఈ కిట్లు సత్ఫలితాలు ఇవ్వలేదని ప్రకటించడంతో ఒక్కసారిగా అలజడి రేగింది.
వాస్తవానికి ఈ కిట్లను అమెరికా ఎఫ్.డి.ఏ సైతం అమోదించింది. కాకపొతే ఈ కిట్లను ఎప్పుడు 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో మాత్రమే ఉంచాలి, ఇది భారత్లో ఆయా రాష్ట్రలకు సాద్యం అయ్యే పని కాకపోవడంతో ఈ కిట్ల వినియోగం పై సందేహాలు ఏర్పడ్డాయనే వాదన ఉంది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ర్యాపిడి టెస్టింగ్ కిట్లు సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో రెండు రోజుల పాటు వాటిని వినియోగించవద్దు అని పూర్తి విచారణ తరువాత తాము చెప్పినప్పుడే తిరిగి వినియోగించాలని ICMR ఉన్నతాధికారి గంగాఖేద్కర్ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు.