iDreamPost
android-app
ios-app

DJ Tillu : హైప్ పెంచుకుంటున్న చిన్న సినిమా

  • Published Feb 03, 2022 | 5:20 AM Updated Updated Feb 03, 2022 | 5:20 AM
DJ Tillu : హైప్ పెంచుకుంటున్న చిన్న సినిమా

నిన్న విడుదలైన డీజే టిల్లు ట్రైలర్ యూత్ ని బాగానే ఆకట్టుకుంటోంది.మొన్నటిదాకా పెద్దగా అంచనాలు లేవు కానీ ఇప్పుడైతే ఓ మోస్తరు హైప్ వచ్చేసింది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సిద్దు జొన్నలగడ్డ టైమింగ్ తో పాటు బాడీ లాంగ్వేజ్, నేహా శెట్టి గ్లామర్, వీటికి తోడు శృతి మించని బోల్డ్ కంటెంట్ మొత్తానికి టార్గెట్ ఆడియన్స్ ని తనవైపు తిప్పేలా రూపొందింది. నిన్న జరిగిన లాంచ్ ఈవెంట్ లో ఓ సీనియర్ జర్నలిస్ట్ అడిగిన ఇబ్బందికరమైన ప్రశ్న తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోయిన్ దాన్ని ఖండించడం, నిర్మాత క్షమాపణ కోరడం, నెటిజెన్లు సదరు మీడియా వ్యక్తిని గట్టిగా తలంటడం లాంటివి ఒక్క సాయంత్రంలో జరిగిపోయాయి.

ఇక డీజే టిల్లు కాన్సెప్ట్ కూడా ఆసక్తికరంగానే కనిపిస్తోంది. అబద్దాలు చెప్పి అమ్మాయిలను ట్రాప్ చేసే హీరో, అతనికి తెలియకుండా మరికొందరిని రివర్స్ ట్రాప్ లో ఇరికించిన హీరోయిన్, అందరికి నిజం తెలిసేలోగా ఒక క్రైమ్ జరిగిపోవడం లాంటి ఆసక్తికరమైన అంశాలు చాలానే జోడించారు. డైలాగులు మాత్రం బాగా పేలాయి. చివర్లో రాధికా ఆప్టే పేరు వాడుకుని రాసిన సంభాషణ బాగా క్లిక్ అయ్యింది. అయితే రిలీజ్ డేట్ మాత్రం అఫీషియల్ గా ప్రకటించకపోవడం గమనార్హం. ఫిబ్రవరి 11 ఖిలాడీ రాకపోతే ఆ తేదీకి వచ్చేలా లేదూ అంటే 18కి విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారట. ఆఫ్ ది రికార్డు మాత్రం 11 అనే చెబుతున్నారు. సో చూడాలి.

రేపు వస్తున్న విశాల్ సామాన్యుడు మీద పెద్దగా అంచనాలు లేకపోవడంతో పాటు అది డబ్బింగ్ సినిమా అవ్వడం వల్ల నెక్స్ట్ లైన్ లో ఉన్న డీజే టిల్లు మీదే డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. ఒకవేళ ఖిలాడీ పోస్ట్ పోన్ అయితే బాక్సాఫీస్ కు ఉత్సాహం తేవాల్సింది ఈ డీజేనే. తెలుగు రాష్ట్రాలకు సుమారు 9 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు చెబుతున్నారు. సిద్దుకు పెద్ద ఇమేజ్ లేకపోయినా ఈ స్థాయిలో పెట్టుబడి రావడం విశేషమే. భీమ్లా నాయక్ నిర్మించిన సితార సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో రేట్ కొంచెం ఎక్కువ తక్కువ అయినా తర్వాత సర్దుకోవచ్చనే కోణంలో అమ్మకాలు జరిగాయని ఇన్ సైడ్ టాక్.

Also Read : Venkatesh & Rana : వెంకీ రానాలు మరోసారి కలిసి చేస్తారా