iDreamPost
iDreamPost
హైదరాబాద్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ ఉదయం నుంచి కుండపోతగా కురుస్తున్న వానల వల్ల నగరం తడిసి ముద్దైపోతోంది. లోతట్టు ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. రోడ్లపై నీళ్ళు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆఫీసులు, కాలేజీల నుంచి వచ్చే వాళ్ళకు సూచనలు చేస్తున్నారు. కొన్ని చోట్ల కూరగాయాలు, పండ్లు నీట కొట్టుకుపోవడంతో రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు తేలిక నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
మరోవైపు భారీ వర్షాలపై ట్వీట్లు, వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్ లో డ్రైనేజ్ వ్యవస్థ వెంటిలేటర్ పై ఉందంటూ ఓ యూజర్ ట్వీట్ చేశాడు. చాలా మంది యూజర్లు నీట మునిగిన రోడ్లను, కాలనీల వీడియోలు పోస్ట్ చేస్తూ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు.