iDreamPost
android-app
ios-app

ట్రిపుల్ రోల్ లో యువ హీరో.. పెద్ద రిస్కే చేస్తున్నాడు

  • Published Jan 25, 2023 | 10:26 PM Updated Updated Dec 11, 2023 | 11:08 AM

'జై లవ కుశ' చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించాడు. కళ్యాణ్ రామ్ కూడా త్వరలో విడుదల కానున్న 'అమిగోస్' మూవీలో మూడు పాత్రలతో అలరించనున్నాడు. ఇక ఇప్పుడు ఆ లిస్టులో మరో యువ హీరో సుధీర్ బాబు చేరనున్నాడు.

'జై లవ కుశ' చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించాడు. కళ్యాణ్ రామ్ కూడా త్వరలో విడుదల కానున్న 'అమిగోస్' మూవీలో మూడు పాత్రలతో అలరించనున్నాడు. ఇక ఇప్పుడు ఆ లిస్టులో మరో యువ హీరో సుధీర్ బాబు చేరనున్నాడు.

  • Published Jan 25, 2023 | 10:26 PMUpdated Dec 11, 2023 | 11:08 AM
ట్రిపుల్ రోల్ లో యువ హీరో.. పెద్ద రిస్కే చేస్తున్నాడు

టాలీవుడ్ లో ఈ జనరేషన్ హీరోలలో డ్యుయల్ రోల్ పోషించిన హీరోలు కొందరు ఉన్నారు కానీ ట్రిపుల్ రోల్ పోషించిన హీరోలు చాలా అరుదు. ‘జై లవ కుశ’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించాడు. కళ్యాణ్ రామ్ కూడా త్వరలో విడుదల కానున్న ‘అమిగోస్’ మూవీలో మూడు పాత్రలతో అలరించనున్నాడు. ఇక ఇప్పుడు ఆ లిస్టులో మరో యువ హీరో సుధీర్ బాబు చేరనున్నాడు.

విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు.. ఈ శుక్రవారం హంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన సుధీర్.. తన తదుపరి చిత్రం ‘మామా మశ్చీంద్ర’ గురించి ఆస్తికర విషయాలను రివీల్ చేశాడు. అమృతం ఫేమ్ హర్షవర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ట్రిపుల్ రోల్ చేస్తున్నట్లు సుధీర్ బాబు చెప్పాడు.

అంతేకాదు ట్రిపుల్ రోల్ పేరుతో ఇంచుమించు పాత్రలన్నీ ఒకేలా ఉండకుండా పాత్రల రూపంలోనే చాలా వ్యత్యాసం ఉంటుందట. ఒక పాత్రలో మామూలు పర్సనాలిటీతో సాధారణ కుర్రాడిలా, రెండో పాత్రలో సిక్స్ ప్యాక్ తో, ఇక మూడో పాత్రలో అయితే 150 కేజీల బరువు గల వ్యక్తిగా కనిపించనున్నాడట. సుధీర్ బాబు కి సిక్స్ ప్యాక్ కొత్తకాదు. ఎప్పుడూ ఆయన మంచి ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూనే ఉంటాడు. అయితే 150 కేజీల వ్యక్తిగా ఆయన లుక్ ఎలా ఉంటుందనేదే ఆసక్తికరంగా మారింది. 2014లో విడుదలైన లడ్డు బాబు చిత్రంలో అల్లరి నరేష్ ఇలాంటి పాత్రే పోషించాడు. అయితే అది ఆయనకు చేదు ఫలితాన్నే మిగిల్చింది. మరి ‘మామా మశ్చీంద్ర’తో సుధీర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూద్దాం.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetkolik girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş