iDreamPost
android-app
ios-app

తస్మాత్ జాగ్రత్త!.. కరెంట్ బిల్ మెసేజ్ ల పేరిట భారీ మోసం!

తాజాగా కరెంట్ బిల్లుల స్కామ్​ వెలుగులోకి వచ్చింది. కరెంట్ బిల్లులు కట్టాలంటూ మెసేజ్ లు పంపించి జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇంటి కరెంట్​ బిల్లు వెంటనే చెల్లించాలని.. లేదంటే సరఫరాను నిలిపివేస్తామని సైబర్​ నేరగాళ్లు మెసేజ్​లు పంపుతుంటారు.

తాజాగా కరెంట్ బిల్లుల స్కామ్​ వెలుగులోకి వచ్చింది. కరెంట్ బిల్లులు కట్టాలంటూ మెసేజ్ లు పంపించి జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇంటి కరెంట్​ బిల్లు వెంటనే చెల్లించాలని.. లేదంటే సరఫరాను నిలిపివేస్తామని సైబర్​ నేరగాళ్లు మెసేజ్​లు పంపుతుంటారు.

తస్మాత్ జాగ్రత్త!.. కరెంట్ బిల్ మెసేజ్ ల పేరిట భారీ మోసం!

సైబర్ నేరగాళ్లు రోజుకో ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్నారు. యూట్యూబ్ లో లైక్స్, ఆన్ లైన్ గిఫ్టులు, లాటరీ గెలిచారంటూ ఫేక్ లింక్స్ పంపించి జనాలను దోచుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ల బారినపడి నిరక్షరాస్యులతో పాటు అక్షరాస్యులు కూడా మోసపోతున్నారు. మోసపూరిత కాల్స్, మెసేజ్ లు, లింక్స్ కు స్పందించి రెప్పపాటులో వారి ఖాతాలను లూటీ చేసుకుంటున్నారు. సైబర్ నేరాల పట్ల పోలీసులు అవగాహన కల్పించినప్పటికీ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో మరో కొత్త రకం మోసం తెరపైకి వచ్చింది. కరెంట్ బిల్లులు కట్టాలంటూ మెసేజ్ లు పంపి మోసానికి పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు.

తాజాగా కరెంట్ బిల్లుల స్కామ్​ వెలుగులోకి వచ్చింది. కరెంట్ బిల్లులు కట్టాలంటూ మెసేజ్ లు పంపించి జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇంటి కరెంట్​ బిల్లు వెంటనే చెల్లించాలని.. లేదంటే సరఫరాను నిలిపివేస్తామని సైబర్​ నేరగాళ్లు మెసేజ్​లు పంపుతుంటారు. ఆ మెసేజ్ లకు స్పందించి చాలా మంది మోసపోతున్నారు. దీనినే విద్యుత్ బిల్లుల స్కామ్​ గా పిలుస్తున్నారు. సైబర్ క్రిమినల్స్ పంపే మెసేజ్ లలో ” ప్రియమైన వినియోగదారులారా.. మీరు గత నెల చెల్లించిన విద్యుత్ బిల్లు అప్​డేట్ అవ్వలేదు. అందువల్ల బిల్లును వెంటనే చెల్లించండి. ఆలస్యమైతే మీ ఇంటికి విద్యుత్ సరఫరాను ఈరోజు రాత్రి 9.30 గంటలకు నిలిపివేస్తాం. మరిన్ని వివరాలకు వెంటనే సంబంధిత అధికారితో మాట్లాడటానికి 92603XXXX73 నంబర్​ ను సంప్రదించండి.. అంటూ మెసేజ్ లు పంపి మోసాలకు పాల్పడుతున్నారు.

ఇలాంటి మెసేజ్​ మీకు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నంబర్​లకు ఫోన్ ​చేయొద్దు. ఒక వేళ ఆ నెంబర్లకు కాల్ చేశారంటే ఖాతా లూటీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఫోన్ కాల్స్ తో కూడా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ మోసగాళ్లు. కరెంట్ ఆఫీస్​ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి మీ విద్యుత్​​ బిల్లు బకాయి ఉందని వెంటనే చెల్లించాలి.. లేదంటే కనెక్షన్ కట్​ చేస్తామని భయాందోళనలకు గురిచేస్తుంటారు. వెంటనే మీ ఫోన్​ కు పంపిన లింక్​ ద్వారా చెల్లించండని మోసపూరితమైన వెబ్​ సైట్​ లింక్​స్ పంపిస్తున్నారు. ఆ లింకులను గనుక ఓపెన్ చేశారంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లే మీ ఖాతాలోని డబ్బు కొట్టేస్తారు.

ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు

అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్​ లు, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
సైబర్​ నేరగాళ్లు పంపే వెబ్​ సైట్​ లింక్​ లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు.
కరెంట్​ బిల్​లుపై సందేహాలుంటే దానిపై ఉన్న ఫోన్​ నంబర్​ కు సంప్రదించాలి.
సైబర్​ కేటుగాళ్లు ఫోన్​ చేసినప్పుడు వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు ఎట్టిపరిస్థితుల్లో కూడా చెప్పవద్దు.