iDreamPost
iDreamPost
చాలా మందికి కళ్ళ కింద నల్లని వలయాలు వస్తూ ఉంటాయి. ఇవి సరైన నిద్ర లేకపోవడం, టైం ప్రకారం తిండి తినకపోవడం, ఎక్కువ రోజులు జ్వరం రావడం వల్ల వస్తాయి. ఏదయినా అనారోగ్యానికి గురైనపుడు కూడా మన కంటి కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నప్పుడు కుడా కళ్ళ కింద నల్లని వలయాలు వస్తాయి. దీనివల్ల మన ముఖం నిర్జీవంగా కనబడుతుంది. ఈ వలయాలను తగ్గించడానికి బయట దొరికే క్రీములు, లోషన్స్ వంటివి వాడుతుంటారు కానీ దానికంటే మనం సహజ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే మంచిది.
కళ్ళ కింద వలయాలను తొలగించాలంటే..
*కీరదోసను చిన్న చిన్న ముక్కలుగా కోసి కొద్దిసేపు ఫ్రిజ్ లో పెట్టాలి. తరువాత వాటిని పావుగంటసేపు కళ్ళ కింద పెట్టుకోవాలి.
*కీరదోసకాయ రసంలో టమాటా,బంగాళాదుంప రసం కలిపి కాళ్ళ కింద రాసుకుని పావుగంట సేపు ఉంచి తర్వాత కడగాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
*అలోవెరా గుజ్జుని తీసుకొని కళ్ళ కింద రాసి 20 నిముషాల తర్వాత చల్లని నీటితో కడిగితే నల్లని వలయాలు పోతాయి.
*టమాటా ముక్కలను వరుసగా కొన్ని రోజులు కళ్ళ కింద పావుగంట సేపు ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.
*టమాటా జ్యూస్ లో కొంచెం నిమ్మరసం కలిపి కూడా కళ్ళ కింద రాయొచ్చు.
*గ్రీన్ టీ బ్యాగ్ ని మనం వాడుకున్నాక పడెయ్యకుండా కాసేపు ఫ్రిజ్లో పెట్టి దానిని కళ్ళ కింద పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
*బంగాళాదుంప గుజ్జును కళ్ళ కింద పావుగంటసేపు ఉంచుకోవాలి, ఈవిధంగా వారానికి రెండుసార్లు చేస్తే కళ్ళ కింద వలయాలు పూర్తిగా తగ్గే అవకాశం ఉంది.
*రోజ్ వాటర్ లో దూదిని ముంచి కాసేపు కళ్ళ కింద మర్దన చేయడం వల్ల కూడా నల్లని వలయాలు తగ్గుతాయి.