iDreamPost
android-app
ios-app

ఉలవలతో ఇలా గారెలు కూడా చేసుకోవచ్చు.. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా??

  • Published Jun 11, 2022 | 7:28 AM Updated Updated Jun 11, 2022 | 7:28 AM
ఉలవలతో ఇలా గారెలు కూడా చేసుకోవచ్చు.. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా??

మన అందరికి ఉలవలు తెలిసినవే. చాలా మందికి ఉలవలు అనగానే ఉలవచారు ఒక్కటే తెలుసు. ఎక్కువగా అందరూ ఇష్టపడి తింటారు. కొంతమంది అయితే ఉలవలని నానబెట్టి తింటారు. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ ఉలవలతో గారెలు కూడా చేసుకోవచ్చు. ఉలవగారెలు ఎలా చేయాలో, వాటి వల్ల ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

ఉలవ గారెలు తయారీకి కావలసిన పదార్థాలు & చేసే విధానం :
*ఉలవలు ఒక కప్పు
*మినప పప్పు అర కప్పు
*బియ్యం పిండి కొద్దిగా
*బేకింగ్ సోడా కొద్దిగా
*బొంబాయి రవ్వ కొద్దిగా
*మొక్కజొన్న పిండి కొద్దిగా
*నూనె సరిపడ
*ఉప్పు సరిపడ

ముందుగా ఉలవలు, మినప పప్పు నాలుగు గంటలు నానబెట్టి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మెత్తగా గ్రైండ్ చేసిన ఈ పిండిలో బియ్యం పిండి, బేకింగ్ సోడా, బొంబాయి రవ్వ, మొక్కజొన్న పిండి, ఉప్పు కలిపి గారెల పిండిలా కలుపుకోవాలి. పొయ్యి మీద నూనె మరిగించి దానిలో పిండిని గారెలల చేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా ఉలవగారెలు తయారు చేసుకోవచ్చు. వీటిని సాస్ లేదా చట్నీతో తినొచ్చు.

ఉలవలలో సాధారణంగా చాలా పోషకాలు ఉంటాయి. కొంతమంది ఉలవలు నానబెట్టి తినమంటే తినరు, అలాగే పిల్లలు కూడా. అలంటి వారికి ఇలా గారెల్లా చేసి ఇస్తే ఇష్టంగా తింటారు. ఉలవలు పోషకాలు కూడా అందుతాయి. ఉలవలు, వాటితో వండిన వాటిని తినడం వల్ల ప్లీహ వ్యాధులతో బాధపడేవారికి మేలు కలుగుతుంది. దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడుతున్న వారు తరచూ ఉలవలను తీసుకొంటే త్వరగా జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. అలాగే ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి, గట్టిపడిన కఫాన్ని పలుచబరచటంలో ఉలవలతో చేసిన ఆహార పదార్థాలు చక్కగా ఉపయోగపడతాయి. మూత్రాశయంలో రాళ్లతో బాధపడేవారు ఈ ఉలవలు తింటే రాళ్లు కరగడానికి సహకరిస్తాయి.