iDreamPost
iDreamPost
మళ్ళీ మా ఎన్నికల వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి బండ్ల గణేష్ బయటికి వచ్చిన తర్వాతి పరిణామాలు చాలా కీలకంగా మారుతున్నాయి. జీవిత రాజశేఖర్ ల మీద బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఏకంగా టీవీ ఇంటర్వ్యూ ఇవ్వడం ఇప్పటికే మెగా వర్గాలకు ఇబ్బందిగా మారింది. ఒకపక్క నాగబాబు ప్రకాష్ రాజ్ కు డైరెక్ట్ సపోర్ట్ ఇస్తూ మరోపక్క చిరంజీవి అండదండలు తమకు ఉన్నాయనే రీతిలో ఈ బృందం ప్రమోట్ చేసుకోవడం ఇప్పటికే వాళ్లకు చాలా అనుకూలంగా మారింది. ఇలాంటి టైంలో బండ్ల గణేష్ ఇలా చేయడం ఎవరూ ఊహించనిది. జెనరల్ సెక్రటరీ పోస్టుకి పోటీ చేస్తానని చెప్పడం కూడా కొత్త మలుపు.
ఇప్పుడు గణేష్ ప్రణాళిక ఎలా ఉండబోతోందన్నది సస్పెన్స్ గా మారింది. మంచు విష్ణు బ్యాచ్ లో చేరే అవకాశాలు ఉన్నాయని కొత్తగా ఓ గాసిప్ మొదలయ్యింది. మధ్యలో నరేష్ మధ్యవర్తిత్వం చేస్తున్నారని కూడా అంటున్నారు. అయితే ఇవన్నీ నిజాలని ఖచ్చితంగా చెప్పడానికి లేదు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు రకరకాల ప్రచారాలు జరుగడం సహజం.నిజాలా కాదా అనేది సదరు వ్యక్తులు చెప్తే కానీ క్లారిటీ రాదు. గణేష్ అంత సాహసం చేస్తాడని అనుకోలేం. ఎందుకంటే అదే జరిగితే నేరుగా మెగా సపోర్ట్ కే తూట్లు పొడిచినట్టు అవుతుంది. ఈ మధ్యే తనకు ప్రాణభిక్ష పెట్టింది చిరంజీవి అని చెప్పిన గణేష్ అంత సాహసం చేయకపోవచ్చు.
సో ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారన్నది వేచి చూడాలి. బండ్ల గణేష్ వ్యవహారం చిరంజీవి దృష్టికి వెళ్లిపోయింది. ఆయన మరి ఫోన్ చేసి మాట్లాడారా లేక వెయిట్ చేసి చూద్దాం అనుకున్నారా ఇంకా తెలియలేదు. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ మా ఎలక్షన్ల గొడవలో చెయ్యి పెట్టడం లేదు. షూటింగులు జనసేన కార్యకలాపాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో బండ్ల గణేష్ కు కనీసం సలహా ఇస్తారని కూడా అనుకోలేం. ప్రస్తుతానికి మంచు విష్ణు మౌనంగానే ఉన్నాడు. తన ప్యానెల్ ని అఫీషియల్ గా ప్రకటించలేదు. త్వరలోనే మీడియా ముఖంగా వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ కథ ఇంకెన్ని మలుపులు తిరగనుందో
Also Read : భయపెట్టబోతున్న అక్కినేని హీరో