iDreamPost
iDreamPost
నిన్న విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లి సందడికి పండగ సెలవు ఫుల్ గా కలిసి వచ్చింది. టాక్ తో సంబంధం లేకుండా ప్రధాన కేంద్రాల్లో ముఖ్యంగా మ్యాట్నీ ఈవెనింగ్ షోలు చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. దీనికి తోడు వీకెండ్ కూడా కలిసి రావడంతో సెలవుల కోసం స్వంత ఊళ్ళకు వెళ్లిన ఫ్యామిలీ ఆడియన్స్ ఈ రెండు మాత్రమే ఆప్షన్ గా పెట్టుకోవడంతో మహా సముద్రం కలెక్షన్లు ఏమంత ఆశాజనకంగా లేవు. నెగటివ్ టాక్ వచ్చిన పెళ్లి సందడి సైతం కేవలం ఎంటర్ టైనర్ అనే ట్యాగ్ తో ప్రమోషన్ చేసుకోవడంతో మొదటి రోజు సుమారు 1 కోటి 60 లక్షలకు పైగా షేర్ తేవడం గమనార్హం. ఈ రోజు కూడా డీసెంట్ గా ఉండబోతోంది.
ఇక డామినేషన్ మొత్తం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దే అయ్యింది. దీనికీ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా ఉన్న మూడు ఆప్షన్లలో ఇదే బెస్ట్ అనే అభిప్రాయం కలగడంతో జనం దీనికే మొగ్గు చూపారు. ట్రేడ్ నుంచి అందిన రిపోర్ట్ మేరకు అఖిల్ సుమారుగా 5 కోట్ల 40 లక్షలకు ;పైగా షేర్ తెచ్చుకున్నాడు. గ్రాస్ అయితే 9 కోట్ల దగ్గర ఉంది. ఇవాళ రేపు బుకింగ్స్ బాగున్నాయి. సరిగ్గా కుదిరితే సగం పైన పెట్టుబడి సోమవారానికి వచ్చేస్తుంది. లవ్ స్టోరీ లాగా యునానిమస్ టాక్ లేకపోవడం కొంత ప్రభావం చూపిస్తున్నప్పటికీ అఖిల్ పూజా కాంబినేషన్, పాటలు ముఖ్యంగా యూత్ ని థియేటర్ల వైపు ఆకర్షిస్తున్నాయి. లాంగ్ రన్ లో దీన్ని నిలబెట్టుకోవాలి.
అనూహ్యంగా నిన్న లవ్ స్టోరీకి కొన్ని చోట్ల హౌస్ ఫుల్ నమోదు కావడం అసలు ట్విస్ట్. వైజాగ్ జగదాంబ కాంప్లెక్స్ లోని రమాదేవి థియేటర్ టికెట్లన్నీ సేల్ అయిపోవడం విశేషం. ఆల్రెడీ వీక్ అయిన ఈ సినిమాకు ఇప్పుడీ పండగ వారాంతం ప్లస్ అవుతోంది. కానీ దురదృష్టవశాత్తు కొండపొలం, రిపబ్లిక్ ఈ అవకాశాన్ని వాడుకోలేకపోయాయి. వీటి కన్నా వరుణ్ డాక్టర్ మెరుగ్గా ఉండటం గమనించాల్సిన అంశం. ఇక మహా సముద్రం మాస్ ని సైతం ఆకట్టుకోలేక చేతులు ఎత్తే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకో యూనిట్ కూడా సడన్ గా సైలెంట్ అయ్యింది. ఓవరాల్ గా కలెక్షన్ల పరంగా చూసుకుంటే బ్యాచిలర్ విన్నర్ గా నిలవబోతున్నాడు
Also Read : Big Screen Cricket : వెండితెరపై క్రికెట్ మ్యాచులు – భలే కిక్కు