iDreamPost
android-app
ios-app

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది.. మర్చిపోయిన డబ్బులు తిరిగిచ్చారు!

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది.. మర్చిపోయిన డబ్బులు తిరిగిచ్చారు!

నేటికాలంలో రోడ్డుపై వంద రూపాయలు దొరికిన కూడా మూడో కంటికి తెలియకుండా తీసుకుంటారు. ఇంకా వేలల్లో, లక్షల్లో డబ్బులు, బంగారం వంటివి దొరికితే ఇంక అంతే సంగతులు. ఇలాంటి సమాజంలో కూడా పరాయి సొమ్ము కోసం ఆరాట పడని, ఆశ పడని వాళ్లు కొందరు ఉన్నారు. అలాంటి  గ్రూప్ కి చెందిన వారే.. శ్రీకాకుళంకి చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్.  ప్రయాణికులు అలా పొరపాటున వస్తువుల్ని మర్చిపోయినా.. ఆర్టీసీ బస్సుల్లో సిబ్బంది మాత్రం వాటిని తిరిగి ఇచ్చేసి తమ నిజాయితీని చాటుకుంటున్నారు. మరి.. ఈ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

నిత్యం ఆర్టీసీ బస్సుల్లో వేలాదిమంది తమ గమ్య స్థానాలకు వెళుతుంటారు. కొందరు ప్రయాణికులు చివరి నిమిషలో బస్సు ఎక్కుతుంటారు.. దిగితుంటారు. ఇలాంటి సందర్భంలో పొరపాటున తమ లగేజీని మర్చిపోయి దిగిపోతుంటారు. మరికొన్ని సందర్భాల్లో లగేజీతో పాటుగా బంగారం, డబ్బులు వంటివి కూడా మర్చిపోతుంటారు. అలానే తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస డిపో పరిధిలో ఓ ఘటన జరిగింది. పలాస డిపోకి చెందిన ఏపీ 30 జడ్‌ 0016 బస్సు కవిటి నుంచి సోంపేట మీదుగా పలాస వెళ్లింది. ఈ క్రమంలో బెజ్జుపుట్టుగ గ్రామానికి చెందిన బడే మాధవరావు తన వెంట తెచ్చుకున్న రూ.1.40 లక్షల డబ్బులు, 10 తులాల వెండి పట్టీలను బస్సులో మర్చిపోయి దిగిపోయాడు. కాసేపు తరువాత డబ్బులు, వెండి ఉన్న సంచిని ఆ బస్సు డ్రైవర్‌ ఎస్‌కేరావు, కండక్టర్‌ పరసయ్య గుర్తించారు.

వెంటనే వాటిని పలాస డిపో సెక్యూరిటీ విభాగానికి అందజేశారు. కొంత సమయం తరువాత ప్రయాణికుడు తాను డబ్బులు, ఆభరణలు బస్సులో మరిచిపోయినట్లు గుర్తించాడు. వెంటనే పలాస డిపోకి వెళ్లి అధికారుల్ని సంప్రదించారు. ఆయన తగిన ఆధారాలు చూపడంతో అప్పటికే తమ వద్ద ఉన్న నగదు, వెండి వస్తువులను ఆయనకు సెక్యూరిటీ సిబ్బంది అప్పగిం చారు. బాధితుడు మాధవరావు డ్రైవర్‌, కండక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. బస్సులో ప్రయాణికుడు పోగొట్టుకున్న బంగారాన్ని తిరిగి అందించి..అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. మరి.. ఇలాంటి నిజాయితీ పరుల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.