iDreamPost
android-app
ios-app

ఏడుగురు హీరోలతో హిట్#8 కూడా వస్తుంది

  • Published Nov 29, 2022 | 4:57 PM Updated Updated Nov 29, 2022 | 4:57 PM
ఏడుగురు హీరోలతో హిట్#8 కూడా వస్తుంది

డిసెంబర్ 2 న “హిట్-ది సెకండ్ కేస్” విడుదలవుతోంది. ఇది విష్వక్సేన్ నటించిన “హిట్-1” కి కొనసాగింపా అని ఐడ్రీం ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకి “హిట్-ది సెకండ్ కేస్” హీరో అడవి శేష్ జవాబిచ్చారు.

“ముందు హిట్-1లోని విక్రం క్యారక్టర్ ని అలాగే కంటిన్యూ చేద్దామనుకున్నారు. కానీ వేరు వేరు నగరాల్లోని వేరు వేరు పోలీసాఫర్స్ కథలు చెబితే కాన్వాస్ పెరుగుతుంది కదా అలోచించి “హిట్” యూనివెర్స్ క్రియేట్ చెయ్యాలనుకున్నారు. అలా వస్తున్నదే ఈ హిట్2. మొత్తానికి ఏడు “హిట్” సీక్వెల్స్ పూర్తైన తర్వాత 8వ సెక్వెల్లో ఈ 7గురు ఆఫీసర్స్ కలిసి కనిపిస్తారు ఒక మార్వెల్ సిరీస్ లో లాగ. వాళ్ళంతా కలిసి ఒక పెద్ద కేస్ ని సాల్వ్ చేస్తారు. హిట్-2 క్లైమాక్స్ లో హిట్-3 హీరో ఎవరో అఫీషియల్ గా రివీల్ అవుతారు”, అని చెప్పారు.

అలాగే “హిట్” టైటిల్ చూసి గతంలో నవ్వుకున్నానని కానీ “హిట్2” లో తానే హీరోగా చేస్తున్నానని సరదాగా చెప్పుకొచ్చారు శేష్.

శైలేష్ కొలను ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు కాగా ప్రశాంతి తిపిర్నేని మరియు హీరో నాని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అడవి శేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపించబోతోంది.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş