మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి అస్వస్థత!

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం కారణంగా అనారోగ్యం పాలైన ఆయన ఆస్పత్రిలో చేరారు. నిన్న రాత్రి నుంచి ఆయనకు జ్వరం వస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం జ్వరం తీవ్ర స్థాయికి చేరింది. గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపిన ఆయనకు ఒళ్లు నొప్పులతో పాటు జ్వరం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. గత వారం రోజులనుంచి ఆయన పలు మీటింగుల్లో పాల్గొన్నారు.

హీరోగా మారిన తన కుమారుడు నిఖిల్‌ గౌడతో  ఓ సినిమాకు నిర్మాణం కూడా చేస్తున్నట్లు తెలిపారు. ఇంతలోనే ఆయన ఆరోగ్యం పాడైంది. అయితే, తాజాగా, ఆయనకు గుండె సంబంధిత ఆపరేషన్‌ జరిగింది. దీంతో కుటుంసభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఇక, హెచ్‌డీ కుమారస్వామి ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వైద్యులు ఆయనకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారట.

ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారట. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారట. త్వరగానే కుమారస్వామి కోలుకుంటారని భరోసా ఇచ్చారంట. కాగా, కుమారస్వామి ఈ మధ్య కాలంలో తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. గత ఏప్రిల్‌ నెలలోనూ ఆయన తీవ్ర జ్వరం బారిన పడ్డారు. అప్పుడు కూడా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. కుమారస్వామిని వరుస అనారోగ్యాలు చుట్టుముడుతుండటంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ కుమారస్వామి అస్వస్థతకు గురవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments