iDreamPost
android-app
ios-app

అప్పుడు ‘ప్రేమమ్’ ఇప్పుడు ‘జాను’ 

  • Published Feb 03, 2020 | 2:03 PM Updated Updated Feb 03, 2020 | 2:03 PM
  • Published Feb 03, 2020 | 2:03 PMUpdated Feb 03, 2020 | 2:03 PM
అప్పుడు ‘ప్రేమమ్’ ఇప్పుడు ‘జాను’ 

కొన్ని కాకతాళీయంగా జరుగుతాయి కానీ వాటికి సంబంధించిన విషయాలు మాత్రం ఆసక్తి రేపుతూ ఉంటాయి. ఇప్పుడు సమంతా చైతు విషయంలో కూడా అలాంటిది ఒకటి జరుగుతోంది. అదేంటో చూద్దామా. 2016లో నాగ చైతన్య ఎంతో ఇష్టపడి చేసిన ప్రేమమ్ వచ్చింది. డీసెంట్ హిట్ గా నిలిచి హీరో కెరీర్ లో పాజిటివ్ పాయింట్ యాడ్ చేసింది. కానీ దాని స్థాయి అది కాదు. అక్కినేని అభిమానులు చాలా ఆశించారు ప్రేమమ్ నుంచి. చరిత్రలో నిలిచిపోతుందనుకుంటే జస్ట్ హిట్ దగ్గర ఆగిపోయింది. 

మలయాళంలో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా సంచలనం సృష్టించిన ప్రేమమ్ ని ఒరిజినల్ స్థాయిలో తీర్చిదిద్దలేదని చాలా కామెంట్స్ వచ్చి పడ్డాయి. సోషల్ మీడియాలో సైతం రెండింట్లో పాత్రలు సన్నివేశాలతో పోలిక తెచ్చి బాగానే ట్రోలింగ్ చేశారు. ఏదోలా సినిమా పాసయ్యింది కానీ ముచ్చటపడి రీమేక్ చేసుకున్న చైతుకు మాత్రం ఆశించిన గొప్ప విజయం దక్కలేదు. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మల్లు వుడ్ సినిమాల్లో ప్రేమమ్ కు చోటు ఉంది కానీ తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్ లో ప్రేమమ్ కు చోటు లేదనే చెప్పాలి 

ఇప్పుడు సమంతా వంతు వచ్చింది. అచ్చం ప్రేమమ్ తరహాలో తమిళ్ లో క్లాసిక్ మాస్టర్ పీస్ గా నిలిచిన 96ని తెలుగులో జాను పేరుతో రీమేక్ చేశారు. ఈ శుక్రవారమే రాబోతోంది. అక్కడ త్రిష చేసిన పాత్రను సామ్, విజయ్ సేతుపతి రోల్ ని శర్వానంద్ చేశారు. 96 గురించి తెగ విన్న మనవాళ్ళు ఆన్ లైన్ తమిళ ప్రింట్ ని ఎప్పుడో చూసేశారు. సన్ టీవీలో పలుమార్లు టెలికాస్ట్ అయ్యింది. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్ గా ఉంది. అంచనాలు అందుకుందా జానుకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఏ చిన్న తేడా కొట్టినా నెటిజెన్లు అలెర్ట్ అయిపోతారు. అసలే వెంకటేష్ నారప్ప విషయంలో తెలుగు తమిళ ఫ్యాన్స్ రెండుగా విడిపోయి నువ్వా నేనా అనుకున్న తరుణంలో ఇప్పుడీ జాను ఎలాంటి ఫలితం తెస్తుందో చూడాలి

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetCasibomCasibomCasibomjojobetbetwooncasibomcasibombetcio giriş