iDreamPost
android-app
ios-app

400 స్క్రీన్లతో భారీ టార్గెట్ పెట్టుకున్న SR

  • Published Aug 05, 2021 | 9:10 AM Updated Updated Aug 05, 2021 | 9:10 AM
400 స్క్రీన్లతో భారీ టార్గెట్ పెట్టుకున్న SR

రేపు రాబోతున్న ఎస్ఆర్ కళ్యాణమండపం సాధారణ పరిస్థితుల్లో విడుదలయ్యుంటే ఇప్పుడున్న బజ్ లో సగం రావడం కూడా కష్టమయ్యేది. రాజావారు రాణిగారు అనే చిన్న సినిమాతో ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీధర్ గాదెని దర్శకుడిగా పరిచయం చేస్తూ కొత్త నిర్మాణ సంస్థ రూపొందించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 400కి పైగా స్క్రీన్లలో రిలీజ్ అవుతోందంటే ఆశ్చర్యం కలగకమానదు. అంతే కాదు థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 4 కోట్ల 60 లక్షల దాకా జరిగినట్టు అనఫీషియల్ ట్రేడ్ రిపోర్ట్. ఏ కోణంలో చూసుకున్నా ఈ కాంబినేషన్ కి ఇది చాలా పెద్ద మొత్తం. అంటే 9 కోట్ల దాకా గ్రాస్ ఆశించాలి.

అసలు ఇంత షాకింగ్ ఫిగర్స్ ఎలా నమోదయ్యాయంటే కారణం ఒకటే. పాటలు ఆల్రెడీ యూత్ లోకి వెళ్లిపోయాయి. ట్రైలర్ కమర్షియల్ గానూ ఎంటర్ టైనింగ్ గానూ కట్ చేశారు. రెండూ జనానికి కనెక్ట్ అయిపోయాయి. సినిమాలో ముందే హిట్టు కళ కనిపించింది. ఇంకేముంది ఎగ్జిబిటర్లకు ఇంతకన్నా మంచి ఛాయస్ కనిపించలేదు. సో పెద్ద రేట్లకే కొనేశారు. రేపు కనక టాక్ పాజిటివ్ వస్తే మాత్రం మిగిలిన పోటీ సినిమాలను ఈ ఎస్ఆర్ కళ్యాణమండపం ఈజీగా ఓవర్ టేక్ చేసేస్తుంది. తిమ్మరుసు రన్ దగ్గరపడింది. ఇష్క్ డిజాస్టర్ కొట్టింది. సో మూవీ లవర్స్ కి కౌంట్ పరంగా ఎన్ని సినిమాలు ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ ఇదే అవుతుంది

ఈ సినిమాకొచ్చే స్పందన ఇతర స్టార్ హీరోల నిర్మాతలను కదిలిస్తుందని పంపిణీదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గత వారం వచ్చిన వాటిలో ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించినవి లేవు. ఒకవేళ ఎస్ఆర్ కనక ఈ విషయంలో సక్సెస్ అయితే ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఇంకొందరికి ధైర్యం వస్తుంది. ఆగస్ట్ 13 తర్వాత ఏపిలోనూ సెకండ్ షోలు, టికెట్ రేట్ల సవరింపుకు గ్రీన్ సిగ్నల్ వస్తుందనే ఆశాభావంతో ఉన్న నిర్మాతలు రేపటి పరిణామాల మీదే దృష్టి పెడుతున్నారు. మొత్తానికి పేరుకి చిన్న సినిమానే అయినప్పటికీ ఇంత పెద్ద బరువు మోస్తున్న ఈ మండపం ఏ ఫలితం తెస్తుందో

Also Read : స్టార్ హీరో ఓటిటి రూటు