iDreamPost
android-app
ios-app

హ్యాపీ ఐడియాకు థియేటర్లు నిండుతాయా ?

  • Published Jul 05, 2022 | 1:10 PM Updated Updated Dec 26, 2023 | 5:58 PM

తెలంగాణలో సింగల్ స్క్రీన్ బాల్కనీ రేట్ 110 రూపాయలు మల్టీ ప్లెక్స్ లో 177 పెట్టడంతో పబ్లిక్ నుంచి మంచి స్పందన వస్తుందనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. కాకపోతే ప్రస్తుతానికి బుకింగ్స్ అంత జోరుగా అయితే లేవు.

తెలంగాణలో సింగల్ స్క్రీన్ బాల్కనీ రేట్ 110 రూపాయలు మల్టీ ప్లెక్స్ లో 177 పెట్టడంతో పబ్లిక్ నుంచి మంచి స్పందన వస్తుందనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. కాకపోతే ప్రస్తుతానికి బుకింగ్స్ అంత జోరుగా అయితే లేవు.

హ్యాపీ ఐడియాకు థియేటర్లు నిండుతాయా ?

ఈ వారం విడుదల కాబోతున్న నోటెడ్ మూవీస్ లో హ్యాపీ బర్త్ డే ఒకటి. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో అందరు కమెడియన్లతో మత్తు వదలరా ఫేమ్ రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ మీద పెద్దగా అంచనాలేం లేవు కానీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం కాబట్టి ప్రమోషన్ల ద్వారా మెల్లగా హైప్ తెచ్చే పనిలో ఉన్నారు. అందులో భాగంగా టికెట్ రేట్లను బాగా తగ్గించడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో సింగల్ స్క్రీన్ బాల్కనీ రేట్ 110 రూపాయలు మల్టీ ప్లెక్స్ లో 177 పెట్టడంతో పబ్లిక్ నుంచి మంచి స్పందన వస్తుందనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. కాకపోతే ప్రస్తుతానికి బుకింగ్స్ అంత జోరుగా అయితే లేవు.

నిజానికి ఈ స్ట్రాటజీ ఎప్పుడో ఫాలో కావాల్సింది. ప్రభుత్వం జిఓ ఇచ్చింది కదాని 200 నుంచి 400 రూపాయల దాకా ధరలను ఇష్టానుసారం నిర్ణయించుకోవడంతో అంటే సుందరానికి లాంటి పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా వసూళ్ల పరంగా బాగా దెబ్బ తిన్నాయి. ఇక టాక్ యావరేజ్ లేదా ఫ్లాప్ వచ్చినవాటి గురించి చెప్పనక్కర్లేదు. సామాన్యులకు థియేటర్ దూరమవుతోందని ఎంత మొత్తుకుంటున్నా నిర్మాతలు పట్టించుకోలేదు. బడ్జెట్ భారాన్నంతా మొదటి వారంలోనే ఆడియన్స్ నుంచి పిండేయాలనే అత్యాశ రివర్స్ కొట్టింది. అందుకే ఏకంగా పోస్టర్లలో టికెట్ రేట్లను ప్రింట్ చేసుకుని పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది.

ఇప్పుడీ హ్యాపీ బర్త్ డే చేసిన పనిని అందరూ ఫాలో అయితే మున్ముందు ఆక్యుపెన్సీలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఏపిలో మరీ ఇంత అన్యాయంగా రేట్లు లేకపోవడం వల్ల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది కానీ నైజామ్ లోనే చిక్కులు ఎక్కువగా ఉన్నాయి. విక్రమ్, మేజర్ లు సూపర్ హిట్ టాక్ వల్ల లాభాలు ఇచ్చాయి. ఈ వారం పృథ్విరాజ్ డబ్బింగ్ మూవీ కడువా వస్తోంది కానీ దాని మీద బజ్ లేకపోవడం హ్యాపీ బర్త్ డేకి కలిసొచ్చే అంశమే. యూత్ కి కనెక్ట్ అయ్యే కామెడీ జానర్ కావడంతో ఇది మాస్ కు ఏ మేరకు నచ్చుతుందనేది ఫైనల్ స్టేటస్ ని నిర్ణయించబోతోంది. వచ్చే వారం 14న రామ్ ది వారియర్ వస్తోంది కాబట్టి ఆలోగానే వీలైనంత రాబట్టుకునే ప్రయత్నం చేస్తోంది హ్యాపీ బర్త్ డే టీమ్.