iDreamPost
iDreamPost
రెండు ప్లాపులిచ్చా. ఈ సారి హిట్ పక్కా అని హను రాఘవపూడి అంటే చాలామంది నమ్మలేదు. కమర్షియల్ సినిమా రణగొణ ధ్వనులు, బాక్సాఫీసు లెక్కల మధ్య హను సినిమా అంటే కొన్ని సందేహాలు, అనుమానాలు ఉంటాయి. అందంతా ఫస్ట్ షో పడటానికి ముందు వరకే. సీతారామం లాంటి పెద్ద కాన్వాస్ ను ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా, హృదయాన్ని పిండేసేలా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాలో చాలా లేయర్స్. హీరో హరోయిన్ల కథ ఒకవైపు, వాటిని లేయర్స్ విడదీసి చెప్పే రష్మిక పాత్ర ఇంకో వైపు. వీటన్నింటిని బ్లెండ్ చేసిన తీరు హిట్ కొట్టింది.
కమర్షియల్ అంశాలకు దూరం. ప్రతి ఫ్రేమ్ ను చెక్కినట్లుగా తీసిన తీరు. క్లాస్ సినిమా అనిపించుకొంటూనే, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చినట్లుగా తీసిన తీరు, హను ప్రతిభకు అద్దం పట్టింది. డైలాగ్స్, స్క్రీన్ ప్లేలో సినిమా హిట్ ఉందని క్రిటిక్స్ అంటున్నారు. అంతర్లీనంగా దేశభక్తి ఉంది. హను రాఘవపూడి ప్రేమకథనే కాదు, దేశభక్తి నేపథ్యాన్ని కొత్త తరానికి చక్కగా చెప్పారనే అనుకోవాలి.
కమర్షియల్ డైరెక్టర్ల హవా నడుస్తున్న ఈ కాలంలో హను మంచి హిట్ కొట్టి క్లాస్ డైరెక్టర్ లకు ఫార్ములా సెట్ చేశాడు. సీతారాం హిట్ తర్వాత భావికత నిండిన సినిమాలను తీసే డైరెక్టర్లు రావడం ఖాయం.