iDreamPost
android-app
ios-app

GVL Comments on CBN -వాటీజ్ దిస్ బాబు :నాడు వద్దన్న నోరే నేడు ముద్దంటోంది?

GVL Comments on CBN -వాటీజ్ దిస్ బాబు :నాడు వద్దన్న నోరే నేడు ముద్దంటోంది?

ఆంధ్ర ప్రదేశ్ ను డ్రగ్స్ కు అడ్డా అని, గంజాయి ఆంధ్ర ప్రదేశ్ అని ముద్ర వేయడానికి ప్రతిపక్షం టీడీపీ చేయని ప్రయత్నం లేదు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో కొంతమంది కేటుగాళ్లు గంజాయి సాగు చేస్తూ దానిని అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా చాప కింద నీరులా జరిగిపోతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే గుజరాత్ కోర్టులో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయో, డ్రగ్స్ కి సంబంధించిన పార్శిల్  మీద ఆంధ్రప్రదేశ్ విజయవాడకు సంబంధించిన ఒక కంపెనీ జీఎస్టీ నెంబర్ వాడడంతో దానిని ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తెప్పించి అమ్ముతుంది అన్నట్లు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

దీని మీద పోలీసులు సహా ఈ వ్యవహారాన్ని డీల్ చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, డిఆర్ఐ లాంటి సంస్థలు అక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్ అడ్రస్ వాడారు తప్ప దాని డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ కాదని ఢిల్లీకి పంపాలని ఉద్దేశంతోనే ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెప్పించారు అని తేల్చారు. ఇక అప్పటి నుంచి రోజు గంజాయి గురించి ఎక్కడ వార్త వస్తుందా అని ఎదురుచూస్తూ ఎక్కడ వార్త వచ్చినా అది వైసీపీ నేతలే స్మగ్లింగ్ చేస్తున్నారు వాళ్లే అమ్ముతున్నారు అన్నట్లు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది టిడిపి. ఈ విషయం మీద సీరియస్ గా ఉన్న పోలీసులు కొద్ది రోజుల క్రితం ధూళిపాళ్ల నరేంద్ర ఆ తర్వాత నక్కా ఆనందబాబుకు నోటీసులు జారీ చేశారు.. ఆ నోటీసుల ప్రకారం వాళ్ళు ఏ ఆధారాలతో ఆరోపణలు చేశారో వెల్లడించాల్సి ఉంటుంది.

Also Read : DGP Gowtham Sawang – డీజీపీ ఫోన్ కాల్ : అబద్దాలతో మరోసారి బుక్కయిన చంద్రబాబు

ఒకవేళ నిజంగా వారి ఆధారాలు సరైనవి అయితే స్మగ్లింగ్ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే ఉద్దేశంతో పోలీసులు నోటీసు జారీ చేశారు. నిజంగా ఆధారాలు ఉంటే కనుక అరెస్టు చేస్తారు లేదంటే నిరాధార ఆరోపణలు చేసినందుకు గాను కేసులు పెడతారు.. కానీ నోటీసులు తీసుకోలేక పట్టాభి అనే నయా నేతను తెరమీదకు తెచ్చి బూతుల పంచాంగంతో విరుచుకుపడ్డారు. ఇదే విషయం మీద రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు చేపట్టాలని భావించగా కొన్నిచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఇప్పుడు చంద్రబాబు ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కేంద్ర బలగాలను కూడా పంపాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేగాక ప్రస్తుత హోం మంత్రిగా ఉన్న అమిత్ షా ను కూడా తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందన ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు ఫైర్‌ అయ్యారు.

గతంలో చంద్రబాబు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకోవాలని, అప్పట్లో ఏపీలోకి అడుగుపెట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి అర్హత లేదని చెప్పిన చంద్రబాబు ఏం ముఖం పెట్టుకుని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తారని జీవీఎల్ ప్రశ్నించారు. గతంలో ఏపీలో చోటుచేసుకున్న అనుభవాలను టీడీపీ మరిచిపోయినా బీజేపీ ఇంకా మరిచిపోలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో బీజేపీ తో చెడిన తర్వాత అమిత్ షా తిరుమల పర్యటనకు వేస్తే రాళ్ళు వేయించిన చంద్రబాబు, ఆ తర్వాత కూడా సిబిఐ ఆంధ్రప్రదేశ్ కు రావడాన్ని నిషేధించారు. వస్తే వచ్చేసి ఏదో ఇబ్బందులు పెట్టేస్తుంది అనే కోణంలో చంద్రబాబు అప్పట్లో మాట్లాడారు. అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంటే మనకు నచ్చదు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అన్ని విషయాల్లోనూ కేంద్రం జోక్యం కావాలి, కేంద్రం అన్ని విషయాలను పట్టించుకుంటూ ఇబ్బందులు లేని చోట కూడా రాష్ట్రపతి పాలన విధించాలి అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు సాధారణ ప్రజలకే కాక టీడీపీ శ్రేణులు కూడా నవ్వు తెప్పించే పరిస్థితి.

Also Read : BJP – JanaSena – దాడులు తప్పయితే.. దూషించిన వారు ఉన్నతులా?!