iDreamPost
android-app
ios-app

ఈ పాప ఇప్పుడో స్టార్‌ హీరోయిన్‌.. ఈ ఏడాది 2 హిట్లు కొట్టింది!

  • Published Dec 26, 2023 | 4:56 PM Updated Updated Dec 26, 2023 | 4:56 PM

దాదాపు 20 ఏళ్ల క్రితం చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. ఈ సంవత్సరం ఆమెకు తెలుగులో రెండు హిట్లు పడ్డాయి.

దాదాపు 20 ఏళ్ల క్రితం చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. ఈ సంవత్సరం ఆమెకు తెలుగులో రెండు హిట్లు పడ్డాయి.

  • Published Dec 26, 2023 | 4:56 PMUpdated Dec 26, 2023 | 4:56 PM
ఈ పాప ఇప్పుడో స్టార్‌ హీరోయిన్‌.. ఈ ఏడాది 2 హిట్లు కొట్టింది!

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్‌ క్రేజ్‌ ఉన్న హీరోయిన్లలో పై ఫొటో కనిపిస్తున్న పాప ముందు వరుసలో ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ చిత్ర పరిశ్రమకు చెందిన వారే కావటం విశేషం. స్టార్‌ కిడ్‌గానే ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తనను తాను నిరూపించుకుంది. తక్కువ సమయంలోనే తెలుగు, తమిళం భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా మారింది. హిందీలోనూ పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కేవలం నటనే కాకుండా.. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా.. సింగర్‌ కూడా తన సత్తా చాటుతోంది.

వ్యక్తిగత విషయాల పరంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. పర్సనల్‌గా ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. సినిమాల పరంగా మాత్రం ది బెస్ట్‌ అనిపించూకుంటూ ఉంటుంది. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తోంది. ఆమె ఇంకెవరో కాదు శృతి హాసన్‌. పై ఫొటో శృతి హాసన్‌ చిన్నపుడు తీసింది. శృతిహాసన్‌ తండ్రి కమల్‌ హాసన్‌ ప్రముఖ నటుడు అని మనకు తెలిసిన విషయమే. ఆమె తల్లి కూడా ఓ ప్రముఖ నటే. ఆమె పేరు సారికా ఠాకూర్‌. 1980లలో హిందీలో చాలా సినిమాల్లో నటించారు.

shruti hasan child hood pic

తల్లిదండ్రుల నటనా వారసత్వాన్ని కొనసాగిస్తూ… చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2000లో వచ్చిన ఋ ‘ హే రామ్‌’ అనే మూవీలో నటించారు. ఇది తండ్రి కమల్‌ హాసన్‌ సినిమా కావటం విశేషం. హే రామ్‌ తమిళంతో పాటు, హిందీలోనూ ఏకకాలంలో తెరకెక్కింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత శృతి హాసన్‌ హీరోయిన్‌గా మారారు. 2009లో వచ్చిన ‘లక్‌’ అనే హిందీ సినిమా చేశారు. అదే సంవత్సరం తెలుగులోనూ ఓ మూవీ చేశారు. అనగనగా ఒక ధీరుడు మూవీలో సిద్ధార్థ్‌కు జంటగా నటించారు.

2012లో వచ్చిన పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘గబ్బర్‌ సింగ్‌’తో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ను అందుకున్నారు. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయారు. అయితే, 2015లో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమా తర్వాత శృతి హాసన్‌కు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. చేసిన చిత్రాలు అన్నీ వరుసగా ప్లాపు అవుతూ వచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత ‘క్రాక్‌’ మూవీతో సూపర్‌ హిట్‌ను అందుకున్నారు. 2023 ఆమెకు లక్కీ ఇయర్‌గా మారిపోయింది. ఈ సంవత్సరం ఆమెకు రెండు బ్లాక్‌ బాస్టర్‌ హిట్లు పడ్డాయి.

వాల్తేరు వీరయ్య, సలార్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించాయి. ప్రస్తుతం ఆమె ఓ ‘ది ఐ’ అనే ఇంగ్లీష్‌ సినిమాలో.. డెకాయిట్‌ అనే తెలుగు, హిందీ బైలింగువల్‌ సినిమాలో నటిస్తున్నారు. మరి, శృతి హాసన్‌ చైల్డ్‌ హుడ్‌ ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet