iDreamPost
android-app
ios-app

Guduputani Report : గూడుపుఠాణి రిపోర్ట్

  • Published Dec 26, 2021 | 7:30 AM Updated Updated Dec 26, 2021 | 7:30 AM
Guduputani Report : గూడుపుఠాణి రిపోర్ట్

మొన్న గట్టి పోటీ ఉండటంతో బాక్సాఫీస్ సాంప్రదాయానికి భిన్నంగా శనివారం విడుదలైన సినిమా గూడుపుఠాణి. సోలో హీరోగా సరైన సక్సెస్ దక్కనప్పటికీ దండయాత్ర చేస్తూనే సప్తగిరి దీని మీద గట్టి ఆశలే పెట్టుకున్నాడు. అంతో ఇంతో దీని మీద అంచనాలు రేగడానికి కారణం ట్రైలరే. ఏదో విషయం ఉన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగింది. దానికి తగ్గట్టు సోషల్ మీడియాలో కూడా బాగానే ప్రచారం చేశారు. కార్తికేయ 90 ఎంఎల్ తో పరిచయమైన నేహా సోలంకి హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి కుమార్ ఎం దర్శకుడు. థ్రిల్లింగ్ బ్యాక్ డ్రాప్ లో లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ గూడుపుఠాణిలో మ్యాటర్ నిజంగా ఉందో లేదో రిపోర్ట్ లో చూద్దాం.

అనగనగా ఒక దొంగల ముఠా. దేవుడి గుళ్లే దానికి టార్గెట్. దోపిడీలు చేయడమే కాక అక్కడికి రహస్యంగా వచ్చిన ప్రేమజంటలను అటకాయించి అమ్మాయిని రేప్ చేసి హత్యలు చేయడం వీళ్ళ నిత్యకృత్యం. ఓసారి గిరి(సప్తగిరి), సిరి(నేహా సోలంకి)అక్కడికి పెళ్లి చేసుకునేందుకు వస్తారు. కానీ ఆ రోజు ముహూర్తం లేదని తెలిశాక వెనక్కు వెళ్లే అవకాశాన్ని మిస్ చేసుకుని గుడిలో చిక్కుకుపోతారు. చీకటి పడ్డాక వచ్చిన దొంగల బ్యాచ్ కు తెలియకుండా సిరి వాళ్ళ వ్యవహారాన్ని వీడియో తీస్తుంది. దీంతో ఈ జంట అక్కడే ఉన్న సంగతి తెలిసిపోతుంది. మరి ఈ వలయం నుంచి గిరి సిరి ఎలా బయటపడ్డారు అనేదే తెరమీద చూడాల్సిన కథ

ఎప్పటిలాగే సప్తగిరి తన టైమింగ్ తో గిరి పాత్రను నిలబెట్టాడు. కామెడీ ఎమోషన్స్ రెండూ బ్యాలన్స్ చేశాడు. నేహా సోలంకి సోసోనే. రఘు కుంచే ఆర్టిస్టుగా నిలబడాలని గట్టిగానే ట్రై చేస్తున్నట్లుంది. పెర్ఫార్మన్స్ బాగుంది. అనంత్ లాంటి ఒకరిద్దరు తప్ప క్యాస్టింగ్ ఇంకెవరు అంతగా గుర్తుండరు. సింగల్ లొకేషన్ కావడంతో బడ్జెట్ పరంగా ఎలాంటి రిస్కు లేకపోయింది. దర్శకుడు కుమార్ ఎం తీసుకున్న ప్లాట్ డిఫరెంట్ గానే ఉన్నప్పటీకీ కథనం ఒక గ్రాఫ్ లో సాగక ఇంప్రెషన్ పడుతూ లేస్తూ సాగుతుంది. ఇంకొంచెం ప్రాపర్ గా రాసుకుని ఉంటే బాగుండేది. ప్రతాప్ విద్య సంగీతం సోసోగానే ఉంది. ఏ అంచనాలు లేకుండా వెళ్తేనే గూడుపుఠాణి ఓ మోస్తరుగా పర్వాలేదనిపిస్తుంది.

Also Read : Parampara : పరంపర వెబ్ సిరీస్ రిపోర్ట్