iDreamPost
android-app
ios-app

Bigg Boss 5 Finale : బిగ్ బాస్ ఫినాలే.. ఏకంగా ఐదు సినిమాల ప్రమోషన్.. వాడకం మాములుగా లేదుగా!

Bigg Boss 5 Finale : బిగ్ బాస్ ఫినాలే.. ఏకంగా ఐదు సినిమాల ప్రమోషన్.. వాడకం మాములుగా లేదుగా!

భారీ అంచనాలతో మొదలైన తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారంతో ముగుస్తుంది. గ్రాండ్ ఫినాలే ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలై నాలుగు గంటల పాటు ప్రసారం కాబోతుంది. ముందు నుంచి టీఆర్పీ విషయంలో ఇబ్బందులు పడగా ఆ కరువు అంతా తీరిపోయేలా ఈ ఎపిసోడ్ ప్లాన్ చేశారని అంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ ఫినాలే స్టేజ్ ని ఏర్పాటు చేసింది బిగ్ బాస్ టీమ్. అంతేకాదు, గత రెండు సీజన్స్ లో మెగాస్టార్ చిరంజీవి రాకతో హౌస్ మేట్స్ లో ఫుల్ జోష్ వచ్చేది. అయితే, ఈసారి అంతకుమించి ఉండాలని గెస్ట్ లతో ఫినాలే స్టేజ్ దద్దరిల్లి పోయేట్టు ప్లాన్ చేశారు.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ స్టేజ్ మీద మొత్తం ఆరు సినిమాల ప్రమోషన్స్ కూడా జరిగాయి. తాజాగా విడుదలైన ప్రోమోల ప్రకారం రణ్ బీర్ కపూర్, అలియా భట్, రాజమౌళి, జగపతి బాబు, నవీన్ చంద్ర, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్, రష్మిక, నాని, సాయి పల్లవి, కృతి శెట్టి గెస్టు లుగా పాల్గొనగా హీరోయిన్ శ్రియ, డింపుల్ హయతి స్పెషల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. ఇక ఈ స్టేజ్ మీద జరిగిన సినిమాల ప్రమోషన్స్ విషయానికి వస్తే రణ్ బీర్ కపూర్, అలియా భట్ జంటగా నాగార్జున కీలక పాత్రలో నటించిన బ్రహ్మాస్త్ర, రాజమౌళి ఆర్ఆర్ఆర్, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్, రష్మికల పుష్ప సినిమాలను ప్రమోట్ చేసుకున్నారు.

వీరు కాక పరంపర అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం నవీన్ చంద్ర, జగపతిబాబు, నాని, సాయి పల్లవి, కృతి శెట్టిలు తమ శ్యామ్ సింగ రాయ్ సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్లారు. ఇక 24న విడుదల కానున్న 83 సినిమాను తెలుగులో నాగార్జున రిలీజ్ చేస్తున్న కారణంగా a సిన్మాలో లీడ్ రోల్ పోషించిన దీపికా పదుకొనే వీడియో కాల్ లో మాట్లాడనున్నారు. మొత్తం మీద ఇదొక అరుదైన ఘట్టం, ఒక ప్రయోగం అనే చెప్పాలి. ఈ ప్రయత్నం వలన అటు స్టార్ మాకి టీఆర్పీ దక్కడమే కాక సినిమా వాళ్ళకు ప్రమోషన్ కూడా జరిగిపోతుంది. మొత్తానికి ఒకరిని ఒకరు భలే వాడేసుకుంటున్నారు అన్నమాట.

Also Read : Sukumar : పాపం సుకుమార్.. పరువు తీసిన సీన్ కు దణ్ణం పెట్టేశాడుగా!

Jojobet GirişmeritbetmeritbetcasibomvbetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin