వైద్య రంగాన్ని బలోపేతం చేయాల్సిందిపోయి దీపాలార్పమంటారా ?

కరోనా వైరస్ దెబ్బకు యావత్ దేశం సంక్షోభంలో కూరుకుపోయిన ఈ సమయంలో వైద్య రంగాన్ని బలోపేతం చేయాల్సింది పోయి ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన పిలుపు విమర్శల పాలవుతోంది. వైరస్ సంక్షోభంలో యావత్ దేశం ఐకమత్యంగానే ఉందని నిరూపించేందుకు దేశంలోని ఇళ్ళల్లో దీపాలు ఆర్పేయాలని మోడి పిలుపిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ప్రధాని ఇటువంటి పిలుపివ్వటం ఇది మూడోసారి.

మొదటిసారేమో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో దేశమంతా జనతా కర్ఫ్యూ విధిస్తున్నట్లు చెప్పారు. సమస్య తీవ్రతను అర్ధం చేసుకున్న దేశ ప్రజలు కూడా అందుకు సానుకూలంగానే స్పందించారు. మోడి చెప్పినట్లే కర్ఫ్యూ తర్వాత సాయంత్రం తప్పట్లతో దేశమంతా మారుమోగించారు. తర్వాత వైరస్ ప్రభావం దేశంలో వ్యాప్తించ కుండా మూడు వారాల లాక్ డౌన్ విధిస్తు మోడి రెండోసారి చెప్పారు. అప్పుడు కూడా మోడి చెప్పింది నిజమే కదా అని ఎవరికి వాళ్ళు లాక్ డౌన్ విధించుకున్నారు.

కానీ ఇపుడు మూడోసారి దీపాలార్పేయండిని ఇచ్చిన పిలుపుపై అన్నీ వర్గాల నుండి విమర్శలు మొదలైపోయాయి. ఇప్పటికే వైరస్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో యావత్ ప్రజలంతా ఐకమ్యతంగానే ఉన్నట్లు దేశం నిరూపించిన విషయాన్ని విమర్శకులు గుర్తు చేస్తున్నారు. ఐకమత్యాన్ని ఇంకా ఎన్నిసార్లు నిరూపించుకోవాలంటూ మండిపోతున్నారు కూడా.

వైరస్ ను ఎదుర్కోవటానికి దేశవ్యాప్తంగా వైద్యులకు, పారా మెడికల్ స్టాఫ్ కు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ లేదు. వైరస్ పరీక్షలు చేయటానికి తగినన్ని ల్యాబులు లేవు. అసలు డాక్టర్లు, వైద్య సిబ్బంది కొరతే తీవ్రంగా ఉంది. ఐసొలేషన్ , క్వారంటైన్ సంటర్లతో పాటు ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి సరిపడా నాణ్యమైన మాస్కులు, గ్లౌజులు లేవు. రోగులకు అవసరమైన వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్ల సరిపడా లేదు. ఈ విషయాలపై దృష్టి పెట్టకుండా తప్పట్లు కొట్టండి, దీపాలార్పండి, చిటెకలేయండి అంటే సమస్య తీవ్రత నుండి జనాల మైండ్ సెట్ మార్చేందుకు మోడి ప్రయత్నిస్తున్నాడని అనుకునే ప్రమాదం ఉంది.

Show comments