iDreamPost
android-app
ios-app

అద్భుతమైన స్పీచ్ ఇచ్చిన విద్యార్థిని.. ఆశ్చరపోయిన సీఎం జగన్!

అద్భుతమైన స్పీచ్ ఇచ్చిన విద్యార్థిని.. ఆశ్చరపోయిన సీఎం జగన్!

బుధవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించారు. జగనన్న అమ్మ ఒడి కింద నిధులను విడుదల చేశారు. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘జగనన్న అమ్మ ఒడి’ అమలు కార్యక్రమానికి సీఎం జగన్ నేడు శ్రీకారం చుట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పది రోజులపాటు పండుగ వాతావరణంలో నిర్వహించి 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నారు. ఇక సభలో మనశ్వీని అనే తొమ్మిదో తరగతి విద్యార్థిని ఈ సభలో ప్రసంగించి.. అందరిని ఆకట్టుకుంది. మీరు ఏపీ లెజెండ్ సార్ అంటూ సీఎం జగన్ పై తన అభిమానాన్ని చాటుకుంది.

పార్వతీపురం మన్యం జిల్లాలోని గమ్మలక్ష్మిపురం కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతుంది.  ఆ  విద్యార్థిని మాట్లాడుతూ..’ నేను ఒక మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన ఎస్టీ  విద్యార్థిని. నేను ముందు నుంచి తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఇప్పుడు జగన్ మామయ్యా ప్రవేశ పెట్టిన అమ్మ ఒడి పథకం ద్వారా ఇంగ్లీష్ మీడియా స్కూల్ లో చదువుతున్నాను. జగన్ సార్ విద్యార్థుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారు. అవన్ని మనకు ఎంతో గొప్పగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా జగనన్న అమ్మ ఒడి  పథకం అనేది ఒక అద్భుతమైనది.

రూ.15,000 నగదను ఎటువంటి అవరోధాలు లేకుండా నేరుగా మన అమ్మల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ.. పిల్లలకు మంచి చదువులు అందిచలేక బాధ పడుతున్న తల్లిదండ్రులకు ఈ పథకం ఎంతో మేలు చేసింది. ఇదంతా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సార్ వలనే సాధ్యమైంది. ఇక జగనన్న విద్యాకానుక విషయానికి వస్తే.. ఇది  హృదయాలకు హత్తుకునే పథకం. ఎందుకంటే.. ఈ పథకం ద్వారా నాణ్యమైన షూలు,  స్కూల్ బ్యాగ్స్ , పుస్తకాలు, దుస్తువులు ఇలా ఎన్నో పొందుతున్నారు.  ప్రభుత్వం ఇచ్చే ఆక్సఫార్డ్ డిక్షనరీ కారణంగా ప్రతి విద్యార్థి సొంతంగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు.

నాడు-నేడు స్కీమ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయి. ఒకప్పుడు ఎంతో అధ్వానంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలు నేడు…కార్పోరేట్ స్కూళ్లను తలదన్నేలా ఉన్నాయి. ఈ క్రెడిట్ అంతా సీఎం జగన్ సార్  గారిది. అలానే జగనన్న ఆణిముత్యాల పథకం ద్వారా ర్యాంకర్లకు ఆర్థిక ప్రోత్సహం అందించారు. అలానే భవిష్యత్తులో నేను కూడా అందుకుంటానని మాటిస్తున్నా సార్. మీరు ఏపీ స్టేట్ కి  లెజెండ్ సార్” అంటూ అద్భుతమైన స్పీచ్ ఇచ్చింది. ఆ చిన్నారి స్పీచ్ కి సీఎం జగన్ తో పాటు మిగిలిన నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరి.. ఈ  విద్యార్థిని స్పీచ్ పై  మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి