iDreamPost
android-app
ios-app

నా లైఫ్ నా ఇష్టం.. వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం.. నా ఫ్యామిలీ గురించి ఎక్కడా పోస్ట్ చేయను..

  • Published Jun 14, 2022 | 12:45 PM Updated Updated Jun 14, 2022 | 12:45 PM
  • Published Jun 14, 2022 | 12:45 PMUpdated Jun 14, 2022 | 12:45 PM
నా లైఫ్ నా ఇష్టం.. వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం.. నా ఫ్యామిలీ గురించి ఎక్కడా పోస్ట్ చేయను..

మన లైఫ్ లు మన ఇష్టం. కానీ సెలబ్రిటీల లైఫ్ లలోకి తొంగి మరీ చూస్తారు జనాలు. వారి సినిమాల గురించి, వారు చేసే పనుల గురించే కాదు, వారి వ్యక్తిగత జీవితాల గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటారు చాలా మంది. ఇటీవల పలువురు సెలబ్రిటీలు తమ ఫ్యామిలీ ఫోటోలని సోషల్ మీడియాలలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది సెలబ్రిటీలు తమ ప్రైవేట్ లైఫ్ ని అస్సలు షేర్ చేయరు. ఈ కోవలోకే వస్తా అంటున్నాడు హీరో గోపీచంద్.

ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు గోపీచంద్. రాశిఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రైవేట్ లైఫ్ ని పబ్లిక్ చేయను అంటూ తెలిపారు.

గోపీచంద్ మాట్లాడుతూ.. నేను సోషల్ మీడియాను కేవలం నా సినిమా అప్ డేట్స్ కోసమే వాడతాను. అందులో నా వ్యక్తిగత విషయాలు పెట్టను. నా ప్రైవేట్ లైఫ్ ను పబ్లిక్ లో పెట్టడం నాకిష్టం ఉండదు. అలా చేస్తే నా ప్రైవసీ పోతుందని భావిస్తాను. చాలామంది తమ వ్యక్తిగత విషయాలు కూడా బయట పెడుతూ ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు, అది వాళ్ళ లైఫ్ వాళ్లిష్టం. నా వరకు నేను వ్యక్తిగత విషయాల్ని సోషల్ మీడియాలో షేర్ చేయను. దీని వల్ల నాతో పాటు, నా కుటుంబసభ్యుల ప్రైవసీ కూడా పోతుంది. ఇది నా ఇష్టం అని అన్నారు.

అలాగే సోషల్ మీడియా చాలా పవర్ ఫుల్ అని మనం దాన్ని ఎక్కువగా వాడితే ఏదో ఒక టైంలో మనకే రివర్స్ కొడుతుందని, అందుకే నేను సోషల్ మీడియా ఎక్కువగా వాడను, వాడినా నా ఫ్యామిలీ, నా వ్యక్తిగత విషయాలు షేర్ చేయను అని తెలిపాడు గోపీచంద్.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss