iDreamPost
android-app
ios-app

గోపీచంద్ కు అంత పంథం ఎందుకో మ‌రి..!

  • Published Jan 10, 2018 | 1:03 PM Updated Updated Jan 10, 2018 | 1:03 PM
గోపీచంద్ కు అంత పంథం ఎందుకో మ‌రి..!

ఏ విషయంలో పంథం అనుకుంటున్నారా..? ఇంకే విష‌యంలో ఉంటుంది సినిమా విష‌యంలోనే..! ఈయ‌న త‌న పంథం మార్చుకోనంటున్నాడు. గోపీచంద్ కు క‌థ‌లు న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా టైటిల్స్ మాత్రం న‌చ్చాలి. అందులో ఆయ‌న‌కు సున్నా క‌నిపిస్తే ప‌డిపోతాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు యాక్ష‌న్ హీరో. ఈయ‌న త‌న సినిమాకు పంథం అనే టైటిల్ పెట్టుకుంటున్నాడు ఈ సారి. అస‌లు జీరోకు గోపీచంద్ కు చాలా స‌న్నిహిత సంబంధాలున్నాయి. కెరీర్ మొద‌ట్లో జ‌యం, నిజం, వ‌ర్షం లాంటి సినిమాల్లో విల‌న్ గా ర‌ప్ఫాడించాడు గోపీచంద్. ఈ మూడు సినిమాల్లోనూ సున్నా టైటిల్ లో ఉంది. ఇక హీరోగా మారిన త‌ర్వాత చేసిన తొలి సినిమా య‌జ్ఞం. ఇందులోనూ సున్నా ఉంది.

ఆ త‌ర్వాత ర‌ణం.. ల‌క్ష్యం.. శౌర్యం.. శంఖం.. లౌక్యం.. సాహ‌సం.. సౌఖ్యం.. లాంటి సినిమాలు చేసాడు గోపీచంద్. ఇందులో శంఖం, సౌఖ్యం త‌ప్ప అన్నీ విజ‌యాలే. దీన్నిబ‌ట్టి సున్నా గోపీచంద్ కు ఎంత‌గా క‌లిసొచ్చిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు మ‌రోసారి త‌న టైటిల్ సున్నాతో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు గోపీచంద్. ఈయ‌న ప్ర‌స్తుతం చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే ఓ హోట‌ల్లో జ‌రుగుతుంది. ఇది గోపీచంద్ కు 25వ సినిమా. దీనికి పంథం అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. అంటే రెండు సున్నాలున్నాయ‌న్న‌మాట‌. ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా న‌టిస్తుంది. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని బెంగాల్ టైగ‌ర్ ఫేమ్ రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. మొత్తానికి చూడాలిక‌.. ఈ సారి రెండు సున్నాల‌తో గోపీంచంద్ పంథం ఎంత‌వ‌ర‌కు విజ‌యం సాధిస్తుందో..!

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomjojobetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet güncel girişjojobet giriş