iDreamPost
android-app
ios-app

ఇండియా పేరు మార్చేసిన గూగుల్ మ్యాప్స్..!

ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోందన్నఅంశంపై ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ ఆజ్యం పోసింది. దేశం మార్పుపై కొన్ని రోజుల నుండి వివాదం జరుగుతున్న సంగతి విదితమే. జీ 20 కన్నా ముందే మొదలైన రచ్చ.. సమసిపోయిందీ అనుకుంటున్న సమయంలో..

ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోందన్నఅంశంపై ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ ఆజ్యం పోసింది. దేశం మార్పుపై కొన్ని రోజుల నుండి వివాదం జరుగుతున్న సంగతి విదితమే. జీ 20 కన్నా ముందే మొదలైన రచ్చ.. సమసిపోయిందీ అనుకుంటున్న సమయంలో..

ఇండియా పేరు మార్చేసిన గూగుల్ మ్యాప్స్..!

ఇండియా పేరు మార్పుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి విదితమే.. మొన్నటి వరకు పొయ్యి మీద పెట్టిన పెనంలా మారిన ఈ అంశం.. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే ఇప్పుడు మరోసారి చర్చకు దారి తీసేలా చేసిందీ అంశం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజెపీ సర్కార్.. ఇంగ్లీష్ పేరున్న ఇండియాను తొలగించి.. భారత్ అని మార్చాలని చూస్తోందని సెప్టెంబర్ ముందు నుండి ఓ ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి ఆజ్యం పోసింది జీ 20 సదస్సు. జీ 20 సదస్సుకు సంబంధించి సభ్య దేశాలకు పంపిన ఆహ్వాన పత్రంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉండటంతో పాటు సదస్సు జరిగే సమయంలో మోడీ కూర్చొన్న స్థానం ఎదురుగా ఉంచిన నేమ్ ప్లేట్ పై ఇండియాకు బదులు భారత్ పేర్కొనడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

తొలుత పార్లమెంట్ సమావేశాల్లో పేరు మార్పు ఉంటుందని అనుకున్నారు. ఆ తర్వాత జీ20 తర్వాత ఇండియా బదులు భారత్ మార్చేస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే వీటిపై ప్రధాని మోడీ కానీ, బీజెపీ శ్రేణులు కానీ స్పందించేందుకు దూరంగా ఉన్నారు. ఈ వివాదం అలా సద్దుమణిగింది అనుకునే సమయంలో.. మళ్లీ చర్చించుకునేలా చేసింది గూగుల్. ఇటీవల గూగుల్ మ్యాప్స్ ఇండియాను భారత్ అని చూపించిందట. గూగుల్ మ్యాప్స్ లో మన దేశాన్ని దక్షిణ ఆసియాలోని భారత్ అని పేర్కొంది. హిందీలో లేదా ఇంగ్లీషులో గూగుల్ మాప్స్ వినియోగిస్తున్నట్లయితే.. ఇండియా అని శోధిస్తే.. భారత్ అని కనిపిస్తున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా జాతీయ జెండా కూడా కనిపిస్తోందట.

అయితే గూగుల్ మ్యాప్స్ నవీనకరణలో భాగంగా ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ఇండియాను భారత్ గా మార్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయా అన్న సందేహం కలుగకమానదు. ఇదిలా ఉంటే ఈ మార్పు గురించి గూగుల్ అధికారికంగా ధృవీకరించలేదని తెలుస్తోంది. గూగుల్ బ్యాక్ గ్రౌండ్ సవరణలు చేసి ఉండవచ్చునన్నది ఓ వాదన. ఒక్క గూగుల్ మ్యాప్స్‌లో నే కాదూ.. గూగుల్ సంస్థకు చెందిన ఇతర ఫ్లాట్ ఫామ్స్‌లో కూడా ఇండియా అని సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు భారత్ పేరు బదులు ఇండియానే కనిపిస్తున్నట్లు సమాచారం. మరీ ఈ మార్పులు దేనికీ, ఎందుకు చేస్తుందో గూగుల్ వివరణ ఇవ్వాల్సి ఉంది.