iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాక నవరత్నాల పేరుతో ఎన్నో పథకాలను ప్రజలకు అందిస్తున్నారు. అంతేకాక అన్ని వర్గాల ప్రజలకు వివిధ పథకాల రూపంలో ఆర్థిక భరోసాను జగన్ సర్కార్ కలిపిస్తుంది. ఇలా ఇప్పటి వరకు తనదైన తీరులో సీఎం జగన్ నాలుగేళ్లు విజయవంతమైన పాలన అందించి.. ఐదో ఏడాదిలోకి అడుగు పెట్టారు. ఆయన అధికారం చెపట్టిన తొలి రోజు నుంచే తరచూ అన్ని వర్గాల వారికి గుడ్ న్యూస్ చెబుతున్నారు. తాజాగా విద్యార్థులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

విద్యార్థులు చదువుకునేందుకు ఆర్ధిక  భరోసాను ఇస్తూ జగన్ సర్కార్ అనేక పథకాలు ప్రవేశ పెట్టింది. అలాంటి వాటిలో కీలకమైనది అమ్మ ఒడి పథకం. ఈ స్కీమ్ ద్వారా ఏటా విద్యార్థులకు నేరుగా నగదు అందజేస్తున్నారు. తాజాగా ఈ ఏడాది కూడా  అమ్మ ఒడి నిధులను విడుదల చేసేందుకు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది.  ఈనెల 28న విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్ లో  అమ్మ ఒడి నిధులను జమ చేయనున్నారు. జగనన్న అమ్మ ఒడి 2022-23 పథకం అమలుకు ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది.

ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్ లలో డబ్బులు జమ అవుతాయి. రూ.15 వేలు అమ్మ ఒడి పథకం ద్వారా ఇవ్వనుండగా .. అందులో స్కూల్, మరుగు దొడ్ల నిర్వహణ నిధి కోసం రూ.2 వేలు మినహాయిస్తున్నారు. మిగిలిన రూ.13 వేలు మాత్రమే విద్యార్థుల తల్లుల ఖాతాలో వేయనున్నారు. కుటుంబ ఆదాయం అర్బన్ ఏరియాలో నెలకు రూ.12 వేలు, గ్రామాల్లో రూ.10 వేల లోపు ఉండే వాళ్లు ఈ పథకానికి అర్హులు. అంతేకాక విద్యుత్ వినియోగం కూడా నెలకు 300 యునిట్ల లోపు ఉండాలి. కుటుంబంలో చదువుకుంటున్న పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఏటా రూ.15 వేల చొప్పున పొందవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొంది.

ట్యాక్సి, ట్రాక్టర్లు, ఆటోలు కలిగిన వారు కూడా ఈ పథకానికి అర్హులు. ఇతర నాలుగు చక్రాల వాహనయాజమానులు అమ్మఒడి పథకానికి అనర్హులు. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కాకుండా పాలిటెక్నిక్, ట్రిపుల్  ఐటీ కోర్సుల్లో చేరేవారికి జగనన్న విద్యాదీవెన పథకాలను అమలు చేస్తారు. మున్సిపాలిటీ వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థిరాస్తి ఉంటే కూడా అర్హులు కారు. అర్హుత కలిగిన విద్యార్థులు ఆన్ లైన్ లోనే చెక్ చేసుకోవచ్చు. పేద కుటుంబాలకు జగన్ అందిస్తున్న ఈ అమ్మ ఒడి పథకంగా బాగా సహాయ పడుతోంది. మరి.. వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి