Arjun Suravaram
Arjun Suravaram
రోజు రోజూకు నిత్యవసర ధరలు ఆకాశం వైపు చూస్తుండటంతో సామాన్యుడు అల్లాడి పోతున్నాడు. అలానే గ్యాస్ ధరలు కూడా సామాన్యుడికి గుద్ది బండలుగా మారాయి. గ్యాస్ ధరల, ఇంధన ధరల పెరుగుదలతో మధ్యతరగతి మనిషి నలిగి పోతున్నాడు. ఇలా పెరుగుతున్న ధరలతో విలవిలాడుతున్న సామాన్యుడికి ఎడారిలో ఓయాసిస్ లా ఊరటనిచ్చే వార్తను కేంద్ర చెప్పింది. దేశ ప్రజలందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ వార్త ఇది. గృహాల్లో వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరికొన్ని నెలలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా కేంద్రం ఈ సంచలన నిర్ణయం తీసుకింది.
మరికొద్ది నెలలో రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇళ్లలో వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించింది. ఉజ్వల పథకం కింద ఒక్కొక్క సిలిండర్ పై అదనంగా మరో రూ.200 సబ్సిడీ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.7,500 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్ 1100 రూపాయల పైనే ఉంది.
మోదీ ప్రధానమంత్రి కాక ముందు.. ఈ గ్యాస్ సిలిండర్ ధర 450 రూపాయలు ఉంది. ఈ తొమ్మిదేళ్ల కాలంలో మూడింతలు పెరిగింది. దీనికి తోడు నిత్యావసర వస్తువులు ధరలు కూడా భారీగా పెరగడంతో సామాన్యులు అల్లాడి పోతున్నారు. ఈ క్రమంలోనో గ్యాస్ సిలిండర్ ధరను 200 రూపాయలకు తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్ ధరపై విపక్షాలు సైతం చాలా విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలనే ఆయా రాష్ట్రాలకు అవకాశం ఇవ్వకుండా కేంద్రమే రూ.200 వరకు తగ్గించింది. మరి.. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.