iDreamPost
iDreamPost
మొత్తానికి ఇండస్ట్రీలో కదలిక వచ్చేలా కనపడుతోంది. థియేటర్లు తెరిచాక కూడా పెద్ద నిర్మాతలు ముందుకు రావడం లేదనే విమర్శకు చెక్ పెట్టేలా కొత్త రిలీజుల షెడ్యూలింగ్ జరుగుతోందని సమాచారం. గత రెండు వారాలుగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో మంచి టాక్ వచ్చినవాటికి చెప్పుకోదగ్గ కలెక్షన్లు రావడం మిగిలినవారికి ఉత్సాహాన్ని ఇస్తోంది. అటు ఓటిటికి ఇవ్వక ఇటు డేట్లు చెప్పక ఇలాగే ల్యాబుల్లో ప్రింట్లను మగ్గబెడితే వచ్చే నష్టం ఇంకా ఎక్కువగా కనిపిస్తుండటంతో మొత్తానికి ఇకపై వేగం పెంచేలా కనిపిస్తున్నారు. డిజిటల్ దారి పట్టాలనుకున్న కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు కూడా తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు కనిపిస్తోంది.
తాజా సమాచారం మేరకు 13 లేదా 14న ‘పాగల్’ తీసుకురావొచ్చని తెలిసింది. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడితే వాళ్ళు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. 19న శ్రీవిష్ణు ‘రాజరాజచోర’, 20న సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ని తీసుకురావొచ్చని అంటున్నారు. 26, 27 తేదీలలో వరసగా ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’, గోపిచంద్ ‘సీటిమార్’లు విడుదల ప్లాన్ లో ఉన్నాయని ఇన్ సైడ్ న్యూస్. నైట్ కర్ఫ్యూలు ఆపేసి వంద శాతం ఆక్యుపెన్సీకి ఏపిలోనూ అనుమతులు వస్తాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇలా ఫాస్ట్ మూమెంట్ కనిపించడం విశేషం. ప్రమోషన్లకు టైం లేనప్పటికీ ఇంతకన్నా వేరే మార్గం కూడా లేదు.
అఫీషియల్ అయ్యేదాకా పైన చెప్పిన డేట్లను కన్ఫర్మ్ గాచెప్పలేం కానీ నిప్పులేనిదే పొగరాదుగా. అందుకే ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది. ఇంకా చాలా చోట్ల కేవలం కంటెంట్ లేదనే కారణంతో థియేటర్లను పూర్తి స్థాయిలో తెరవలేదు. యువి సంస్థ ఆధీనంలో నడిచే వి సెల్యులాయిడ్ కాంప్లెక్సులను ఈ కారణంగానే ఇంకా మూసే ఉంచారు. ఇలాంటి చాలా ఉన్నాయి. కేవలం నగరాల్లో మాత్రమే సింగల్ స్క్రీన్లు ఎక్కువగా ఆపరేట్ అవుతుండగా బిసి సెంటర్లలో మరికొన్ని రిలీజ్ డేట్ల అనౌన్స్ మెంట్ల కోసం ఎదురు చూస్తున్నాయి. మొత్తానికి అనుకున్నదాని కన్నా త్వరగా ఈ నెల మూడో వారానికే అంతా సర్దుకునేలా కనిపిస్తోంది
Also Read : గాడ్ ఫాదర్ లో ఊహించని పాత్ర