Krishna Kowshik
తిరుమలలో కొలువై ఉన్న వెంకటేశ్వరుడ్ని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే రద్దీ దృష్ట్యా కేవలం శ్రీవారిని దర్శించుకుని, ఇతర పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను వీక్షించకుండానే వెనుదిరుగుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ వార్త.
తిరుమలలో కొలువై ఉన్న వెంకటేశ్వరుడ్ని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే రద్దీ దృష్ట్యా కేవలం శ్రీవారిని దర్శించుకుని, ఇతర పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను వీక్షించకుండానే వెనుదిరుగుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ వార్త.
Krishna Kowshik
దేశంలో అతిపెద్ద ఆలయాల్లో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం. సాక్షాత్తూ ఆ వెంకటేశ్వరుడే ఇక్కడ కొలువై ఉన్నాడని భక్తులు విశ్వసిస్తుంటారు. కలియుగ దైవంగా కొలవబడే శ్రీహరిని దర్శించుకునేందుకు దేశంలోని భక్తులే కాకుండా, విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు. భక్తులతో నిత్యం తిరుమల వీధులు కిక్కిరిసి పోతూ ఉంటుంది. వెంకటేశ్వరుడు నెలవై ఉన్న ఏడు కొండలను కనులారా తిలకించి, మొక్కులు సమర్పించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆధ్మాతిక చింతనలో మునిగి తేలిపోతుంటారు. సెలబ్రిటీల హడావుడి కూడా ఎక్కువగా ఉంటుంది. పర్వదినాలు, ప్రత్యేక దినాల్లో ఎంత రద్దీ ఉన్నా శ్రీవారిని దర్శించుకోవాల్సిందే.
తిరుపతి వెళ్లే భక్తులు కేవలం ఆలయాన్ని సందర్శించి.. సమయాభావం కారణంగా మిగిలిన ప్రాంతాలను చూడకుండా వెను దిరుగుతున్నారు. అలాంటి వారికి ఓ శుభవార్త. ఈసారి తిరుమల, పరిసర ప్రాంతాలను చుట్టేయాలనుకుంటే.. ఈ వార్త మీకోసమే. తిరుమలలో సరికొత్తగా హెలికాఫ్టర్ రైడ్ ప్రారంభమైంది. ఈ హెలికాఫ్టర్ ద్వారా తిరుపతి శేషాచల అందాలను, పరిసరాలను వీక్షించవచ్చు. ఈ అవకాశాన్ని కల్పిస్తోంది చెన్నైకు చెందిన ఏరో డాన్ ఏవియేషన్ సంస్థ. తిరుపతి తుమ్ముల గుంట క్రికెట్ స్టేడియం నుండి దీన్ని ప్రారంభించారు సంస్థ నిర్వాహకులు. ఈ రైడ్ ప్యాకేజీ రూ. 6 వేల నుండి అందుబాటులో ఉంది.
ఇందులో ఆరు సీట్ల కెపాసిటీ ఉంటుంది. అంటే పైలట్ కాకుండా ఐదుగురు పర్యాటకులు హెలికాఫ్టర్‌లో చక్కర్లు కొట్టొచ్చు. ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు.. ప్యాకేజీ రూపంలో హెలికాఫ్టర్ రైడ్ బుక్ చేసుకోవచ్చునని చెబుతున్నారు నిర్వాహకులు. కేవలం భక్తులే కాదూ.. స్థానికులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. హెలికాఫ్టర్ ఎక్కాలన్న కోరిక ఉన్నవాళ్లని ఇదొక సదవకాశం అని చెప్పొచ్చు. తిరుపతి, చంద్రగిరి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను విహంగ వీక్షణం చేసేందుకు ఈ రైడ్‌ని తీసుకు వచ్చింది సదరు సంస్థ. ఈ రైడ్ సక్సెస్ అయితే తిరుపతి చెన్నై మార్గంలో కూడా ప్రవేశపెట్టే ఆలోచన ఉందని పేర్కొన్నారు.