తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టింది. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు వివిధ స్కీమ్ లను ప్రారంభించింది. అలానే కేవలం ప్రజల కోసమే కాకుండా విద్యార్థుల కోసం కూడా అనేక సంస్కరణలు, పథకాలను తీసుకొచ్చింది. పిల్లలకు మంచి విద్యను అందించడం ద్వారానే భావితరాల భవిష్యత్ బాగుంటుందని బలంగా నమ్మిన వ్యక్తి సీఎం కేసీఆర్. అందుకే విద్యార్థులు చదువుకోసం పలు పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా బ్రాహ్మణ విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
బ్రాహ్మణ విద్యార్థులు, పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా విదేశీ విద్యాపథకం, పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక సాయం అందిచనుంది. ఈ మేరకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్ డాక్టర్ కే.వి. రమణాచారి వివరాలు వెల్లడించారు. నేటి నుంచి ఆగష్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. పేద బ్రాహ్మణ విద్యార్థుల విదేశీ చదువులకు కోసం విదేశీ విద్యా పథకానికి ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.
ప్రతి ఏటాలాగానే ఈ ఏడాది కూడా అర్హులైన బ్రహ్మణ విద్యార్థులు ఆగష్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని రమణాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలు, మార్గదర్శకాల కోసం అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలని సూచించారు. అలానే పారిశ్రామిక వేత్తలు కూడా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. మరి..బ్రాహ్మణ విద్యార్థులు, పారిశ్రామిక వేత్తల కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ ఆర్థిక సాయాంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కన్నీరు పెట్టిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.. కాపాడండి అంటూ..!