iDreamPost
android-app
ios-app

ఏపీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్

  • Published Jun 03, 2022 | 10:43 AM Updated Updated Jun 03, 2022 | 10:43 AM
ఏపీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్

కాంట్రాక్ట్ లెక్చరర్లు, ఉపాధ్యాయుల జీతభత్యాల గురించి తెలిసిందే. పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా ఉంటుంది. కాంట్రాక్టు లెక్చరర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం కనీస టైమ్ స్కేల్ ను అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి పెంచిన జీతాలు అమల్లోకి వచ్చినట్లు సొసైటీ కార్యదర్శి ఆర్. నరసింహారావు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద జీతాలను పొందుతున్న ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులను విద్యాశాఖలో విలీనం చేయాలని ఏపీ ఉపాధ్యాయుల సంఘం కోరింది. ఇంకోవైపు ప్రభుత్వంలో విలీనమైన ఎయిడెడ్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి 010 పద్దు కింద జీతాలు చెల్లించేలా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది.