Krishna Kowshik
Krishna Kowshik
బంగారం ఇష్టపడని కాంతామణి ఉండదు. ఆడవారి అందాన్ని ఇనుమడింపచేసే ఈ లోహానికి భారత్‌లో యమ క్రేజ్. బంగారం, వెండి ధరలను ధరించడమే కాదూ కొనుగోలు చేయడమన్నా ఇష్టం మగువలకు. కారణం ఆపద సమయాల్లో ఆదుకుంటుంది. అత్యవసర పరిస్థితులు, పిల్లల చదువులకు ఠక్కున గుర్తుకు వచ్చేది బంగారు ఆభరణాలే. వీటిని తాకట్టు పెట్టి అప్పటికప్పుడే ఆర్థిక అవసరాల నుండి గట్టెక్కవచ్చు. అంతేకాదూ.. రోజు రోజుకు వీటి ధరలు పెరుగుతుండటం మరో కారణం. అయితే ఇటీవల వడివడిగా బంగారం ధరలు తగ్గుతున్నాయని ఆనందపడేలోపు.. ఆశల్ని ఆవిరి చేశాయి. శ్రావణ మాసంలో కాస్త నేల చూపులు చూసిన బంగారం ధర.. రెండు రోజుల నుండి ఆకాశం వైపు చూస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్‍లో బంగారం ధరలు స్థిరంగా ఉంటే.. దేశంలో మాత్రం పెరిగాయి. ప్రస్తుతం భాగ్య నగరి హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర పది గ్రాములపై 220 పెరిగింది. దీంతో తులం బంగారం ధర 59,890 రూపాయలు పలుకుతోంది. ఇక ఆర్నమెంట్ బంగారం 22 క్యారెట్ల ధర తులానికి 200 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 54,900లుగా నమోదైంది. గత కొన్ని రోజులుగా తగ్గిందంతా.. రెండు రోజుల్లోనే పుంజుకోవడం గమనార్హం. బంగారం బాటలోనే సిల్వర్ ధరలు కూడా నడుస్తున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే రూ. 1200లకు ఎగబాకింది. తాజాగా కిలో వెండిపై రూ. 700 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ ధర రూ. 78, 200 వద్ద పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంచు మించు ఇవే ధరలు ఉంటాయి.