గాడ్ ఫాదర్ – కలెక్షన్ మీటర్

పెద్దగా అంచనాలు లేకుండా ఆచార్య డిజాస్టర్ ఎఫెక్ట్ తో పాటు నిర్మాణ సంస్థ ప్రమోషన్ల అలసత్వం వల్ల తక్కువ అంచనాలతో వచ్చిన గాడ్ ఫాదర్ మరోసారి చిరంజీవి స్టామినా చాటుతోంది. ఒక్క ఫ్లాపుతో పోయే మార్కెట్ కాదని కలెక్షన్లు రుజువు చేస్తున్నాయి. ఈ కారణంగా బాగుందనే టాక్ వచ్చినప్పటికీ బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం దీని వల్ల పూర్తిగా నలిగిపోగా వీక్ కంటెంట్ ఉన్న వల్ల నాగార్జున ది ఘోస్ట్ సైతం వసూళ్ల కోసం ఇబ్బంది పడుతోంది. నైజామ్ లో కొన్ని ప్రాంతాల్లో నెమ్మదిగా ఉన్నప్పటికీ చిరు ర్యాంపేజ్ ఏపీలో మాత్రం ఓ రేంజ్ లో సాగుతోంది. చాలా కాలం తర్వాత మెగాస్టార్ రియల్ మాస్ చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు కదులుతున్నారు.

యూనిట్ అఫీషియల్ గా ప్రకటించిన దాని ప్రకారం గాడ్ ఫాదర్ రెండు రోజులకు గాను 69 కోట్ల 12 లక్షల గ్రాస్ సాధించింది. ఫస్ట్ డే వచ్చిన 38 కోట్లతో చూసుకుంటే డ్రాప్ శాతం కేవలం ఇరవై మాత్రమే ఉండటం విశేషం. లాంగ్ వీకెండ్ ని వాడుకోవడానికి మంచి అవకాశం దక్కినట్టే. థియేట్రికల్ తో అన్ని హక్కులను కలుపుకుని చూసుకుంటే ఆల్రెడీ నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ మీదున్నారు. బయ్యర్లు ఈ సినిమా ఎలా ఆడినా నష్టపోయేది ఉండదు. నిర్మాతలు అడ్వాన్స్ బేసిస్ మీద రిలీజ్ చేశారు కాబట్టి నష్టం వచ్చినా లాభం కలిగినా వాళ్లకే వెళ్తుంది. కాకపోతే ముందు చెప్పినట్టు 90 కోట్ల టార్గెట్ మాత్రం సులభం కాదు. కనీసం 2 వారాల స్ట్రాంగ్ రన్ అవసరం.

గాడ్ ఫాదర్ ఫలితం చిరంజీవితో సినిమాలు చేస్తున్న నిర్మాతలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆచార్య వల్ల జనంలో ఆయన మీద ఆసక్తి తగ్గిందేమోననుకుంటున్న తరుణంలో ఇలాంటి ఫలితం దక్కడం వాళ్లకు బిజినెస్ కోణంలో చాలా ఉపయోగపడనుంది. హిందీ వెర్షన్ నుంచి మొదటి రోజు రెండు కోట్ల దరిదాపుల్లోకి వెళ్లిన ఈ మెగా మూవీకి నార్త్ సర్కిల్స్ లో చెప్పుకోదగ్గ పోటీ ఏదీ లేదు. విక్రమ్ వేదా స్టడీగా ఉంది కానీ మరీ గొప్పగా లేదు. పొన్నియన్ సెల్వన్ 1 తమిళంలో ఎంత అద్భుతంగా ఆడుతున్నా మిగిలిన చోట్ల సోసోగానే వెళ్తోంది. సో సల్మాన్ ఫ్యాక్టర్ ని ఉపయోగించుకుని పబ్లిసిటీ స్పీడ్ పెంచితే గాడ్ ఫాదర్ అక్కడ కూడా మంచి క్లోజింగ్ నమోదు చేయొచ్చు

Show comments