Idream media
Idream media
ఒరే గంగులూ హైదరాబాద్ కట్టిందెవర్రా….. నిజాం నవాబ్ కదండీ. కాదురా చంద్రబాబు గారు కట్టారు. మరి చార్మినార్ కట్టిందెవర్రా…? అదీ నిజామేనండీ.. కాదురా.. అది కూడా చంద్రబాబే.. మరి బేగంపేట ఎయిర్ పోర్టు, రైల్వేస్టేషన్లు ఎవరు కట్టార్రా.. అదేమోనండి.. అవి నిజాం నవాబూ ఇంకా బ్రిటిషోళ్లు కదండీ.. కాదెహె.. అది కూడా చంద్రబాబే.. ఓహెూ.. నాకు తెలీదండి.. మరి హుస్సేన్ సాగర్ తవ్వించింది, అసెంబ్లీ భవనాలు కట్టించిందెవర్రా.. అవి కూడా అప్పటి నవాబులే కావచ్చండి.. నీకు చెప్పలేకపోతున్నాన్రా గంగులూ.. అవి కూడా చంద్రబాబే కట్టాడ్రా..పొన్లేగానీ మీరు అన్ని ప్రశ్నలు అడిగారు కదా… నేను ఒక్కటి అడగొచ్చా.. అన్నాడు గంగులు.. అడుగురా ఆ న్నాడు నాగులు.. మరి అన్ని కట్టించి అభివృద్ధి చేసిన పెద్ద మేస్త్రీ చంద్రబాబు ఈ హైదరాబాద్ ఎల చ్చన్లలో పోటీ చేయడం లేదేటండీ అన్నాడు మొకం అదోలా పెట్టి. ఒరేయ్ ఇలాంటి తిరకాసు ప్రశ్నలు అడిగితే పీక పిసికేసి డిక్కీలో తొంగుండబెట్టిగలను అన్నాడు నాగులు… ఇదన్నమాట సంగతి..
దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా లేని పెద్దరికం తెచ్చుకుని మరీ వెళ్లి.. అక్కడ అప్పటికప్పుడు గ్రూపులు కట్టి, రాజకీయం చేసి మేధావినని సొంత పేపర్లలో రాయించుకునే చంద్రబాబు తన ఇంటి చుట్టూరా
ఎన్నికలు జరుగుతున్నా కిక్కురు మనడం లేదు. హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని చెప్పుకునే టిడిపి అధినేత ఇప్పుడు ఆ ఎన్నిక విషయాన్ని గుర్తించడం లేదు. అలా అనేకంటే గుర్తించి , ఊడబొడిచేంత సీను లేదన్న విషయం వారికి అర్థమైందని తెలుస్తోంది. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ చక్రం తిప్పేంత సీను లేదు. దానికి తోడు ఎమ్మెల్సీ ఓట్లను బేరమా దుతూ తెలంగాణ ఏసీబికి దొరికిపోయి నైతికంగా పరువు పోగొట్టుకుని రాత్రికి రాత్రి తట్టాబుట్టా సర్థుకుని అమరావతి పారిపోయి వచ్చారు. ఆ తరువాత దాదాపు ఏడాది వరకూ హైదరాబాద్ వంక చూడనేలేదు..
మళ్లీ తాను అక్కడ అడుగుపెట్టి రాజకీయాలు చేస్తానంటే తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం ఒప్పుకునే ప్రశ్నే ఉండదు. అందుకే బంజారా హిల్స్ లోని తన ఇంటి చుట్టూ ఎన్నికలు జరుగుతున్నా తనకు ఏమీ తెలియ నట్లు నిద్ర నటిస్తున్నారు. కేవలం తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు రమణ, ఇంకొందరు నాయ కులు మాత్రం తాము ఉన్నామంటూ అప్పుడప్పుడూ ప్రకటనలు చేస్తూ ఉనికి చాటుకుంటున్నారు. ఊళ్లోనే ఉన్నాడు.. మొత్తం సిటీని కట్టిన పెద్దమేస్త్రి చంద్రబాబు ఓసారి సిటీలో తిరిగితే బాగుణ్నుకదా.. నా లుగు ఓట్లు వస్తాయని కొందరు అభ్యర్థులు ఆశిస్తుండగా… బాబూ ఆయన వచ్చాడంటే రావాల్సిన ఆ నాలుగు ఓట్లూ రాకుండా పోతాయి … ఎందుకొచ్చిన గొడవ ఊరుకోండి స్వామీ ఆని ఇంకొందరు కార్యకర్తలు లోలోన మథనపడుతున్నారు.
పెదబాబు చంద్రబాబు, చినబాబు(లోకేష్), ఇద్దరూ – హైదరాబాద్లోనే ఉంటున్నారు, అక్కడే డిసెంబర్ 1న ఎన్నికలు జరుగుతున్నాయి అయినా తమకు పట్టనట్లు ఉండడం బహుశా చంద్రబాబు రాజకీయ చరిత్రలోనే తొలిసారి కావచ్చు. లేకుంటే ఈపాటికే రోజూ వీడియో కాన్ఫరెన్సులు, కార్యకర్తలకు దిశానిర్దేశాలు, స్కెచ్లు, ప్లాన్లతో అదరగొ ట్టడం, మీడియాలో ఊదరగొట్టడం ద్వారా చాణక్యుడు, చంద్రగుప్తుడు అని కిరీటాలు తగిలించుకోవడం జరిగేదని, ఇప్పుడు అదేం లేకుండా ఆయన ఆజ్ఞాత వాసంలో గడుపుతుండడం విచిత్రమైన ని కార్యకర్తలు భావిస్తున్నారు. గతంలో జరిగిన హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకే ఒక సీటును టిడిపి దక్కించుకోగా ఆ ఒక్కడు కూడా టిఆర్ఎస్లోకి ఫిరాయించి టిడిపి స్కోరును సున్నా చేసేశాడు. దీంతో చంద్రబాబు భవిష్యత్తును ఊహించే ఈ ఎన్నికలకు భయపడి దూరంగా ఉంటున్నట్లు స్పష్టమవుతోంది