Jo Lindner: విషాదం.. 30 ఏళ్లకే ప్రముఖ బాడీ బిల్డర్ మృతి! కారణం ఏంటంటే?

  • Author Soma Sekhar Published - 11:22 AM, Mon - 3 July 23
  • Author Soma Sekhar Published - 11:22 AM, Mon - 3 July 23
Jo Lindner: విషాదం.. 30 ఏళ్లకే ప్రముఖ బాడీ బిల్డర్ మృతి! కారణం ఏంటంటే?

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరని వైద్యుల చెబుతూనే ఉంటారు. అయితే మితము.. హితము అన్నట్లుగా వ్యాయామం ఉంటేనే ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుంటుంది. ఇక ఈ మధ్య కాలంలో జిమ్ చేస్తూ.. చనిపోయేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కాగా.. తాజాగా ప్రపంచ ప్రముఖ బాడీ బిల్డర్ జో లిండ్నర్ 30 ఏళ్లకే మరణించారు. అతడి మరణం అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. దాంతో 30 సంవత్సరాలకే తమ అభిమాన బాడీ బిల్డర్ మరణించడం ఏంటని.. అతని మరణానికి గల కారణాలను వెతకడం ప్రారంభించారు. మరి లిండ్నర్ మరణానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జో లిండ్నర్.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జర్మనీకి చెందిన ప్రముఖ బాడీ బిల్డర్ జో లిండ్నర్. బాడీ బిల్డింగ్ తో పాటుగా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా ఇతడి వరల్డ్ వైడ్ గా అభిమానులు ఉన్నారు. కాగా.. ఇన్ స్టాగ్రామ్ లో ఇతడికి 85 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక తన ఫిట్ నెస్ వీడియోలతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు లిండ్నర్. యూట్యూబ్ లో దాదాపు 50 కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకున్నాడు. ఫిట్ నెస్ వీడియోలను తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటాడు జో.

ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు లిండ్నర్. అదీకాక మెడనొప్పితో బాధపడిన మూడు రోజుల్లోనే తన స్నేహితురాలు నిచా సమక్షంలోనే చనిపోయాడు. ఈ విషయాన్ని నిచా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. దాంతో లిండ్నర్ ఫాలోవర్స్ ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. దీంతో ఫిట్ నెస్ గురించి అధికంగా జిమ్ చేసే వారి గురించి చర్చ మెుదలైంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జో లిండ్నర్ కండరాల వ్యాధి(రిపిలింగ్ మజిల్ డిసీజ్) సమస్యతో బాధపడుతున్నాడు. ఈ సమస్య కారణంగా ఒత్తిడికి గురైన టైమ్ లో కండరాలు చాలా భిన్నంగా ప్రవర్తిస్తాయి.

ఇక కండరాలపైన ఒత్తిడి పెంచడంతో ఓ రకమైన రసాయనిక చర్య ఏర్పడి, అవి మెుత్తం ఒక చోటకు చేరి బలంగా కనిపిస్తాయని డాక్టర్లు తెలిపారు. అయితే జో లిండ్నర్ కు వచ్చిన రిపిలింగ్ వ్యాధి ఉన్న వారిలో కండరాలు విపరీతమైన ఒత్తిడికి గురైన సమయంలో ఒకే మజిల్ లా కాకుండా.. వేర్వేరుగా అలల వలే కనిపిస్తాయి. ఇలా ఓ 20 సెకన్ల పాటు కనిపించవచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో క్రాంప్ ఏర్పడి.. ఓ గడ్డలా ఏర్పడి విపరీతమైన నొప్పికి కారణం కావొచ్చు. ఇక తన సమస్య గురించి జో లిండ్నర్ తరచుగా ప్రస్తావించేవాడని సన్నిహితులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అతిగా చేస్తే.. ఏ పని అయినా ప్రాణాంతకమే అని ఇటీవల మరణాలు హెచ్చరిస్తున్నాయి.

Show comments