P Krishna
Famous Bodybuilder Illia Yefimchyk: ఈ మధ్య కాలంలో చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ కి గురై కన్నుమూస్తున్న వారి సంఖ్య రోజు రోజు కీ పెరిగిపోతుంది.
Famous Bodybuilder Illia Yefimchyk: ఈ మధ్య కాలంలో చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ కి గురై కన్నుమూస్తున్న వారి సంఖ్య రోజు రోజు కీ పెరిగిపోతుంది.
P Krishna
        
ఇటీవల వరుస గుండెపోటు మరణాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. ఆరోగ్యంగా కనిపిస్తున్న వారు సైతం అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ కి గురై చనిపోతున్నారు. అధిక వ్యాయామం, అనారోగ్య సమస్యలు, ఎక్కువ సేపు డ్యాన్స్ చేయడం, డీజే సౌండ్స్ ఇలా ఎన్నో కారణాల వల్ల గుండెపోటు రావడంతో మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు అంటున్నారు. ప్రపంచంలోనే టాప్ బాడీ బిల్డర్ హార్ట్ ఎటాక్ తో కన్నుమూయడంతో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..
ప్రపంచంలోనే టాప్ బిల్డర్ గా పేరు తెచ్చుకున్న ఇలియా యెఫిమ్‌చిక్ (36) గుండెపోటు కారణంగా కన్నుమూశారు. ఎంతో ఫిట్ గా ఉండే ఇలాయా హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసి అందరూ షాక్ తిన్నారు. కండలు తిరిగిన దేహంతో ప్రపంచం వ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు సంపాదించారు ఇలియా. జిమ్ లో వ్యాయాం చేస్తుండగా ఇలియా యోఫిమ్‌చిక్ 6వ తేదీ గుండెపోటు రావడంతో ఆయన భార్య అంబులెన్స్ కు ఫోన్ చేసింది. అప్పటి వరకు సీపీఆర్ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 11న చనిపోయినట్లు నిర్ధారించారని అతని భార్య అన్నా మీడియాకు వెల్లడించారు.
వృత్తి పరంగా ఇలియా బాడీ బిల్డింగ్ ఈవెంట్స్ లో పోటీ పడుతూ ఎన్నో అవార్డులు, రివార్డులు గెల్చుకున్నారు. బీభత్సమైన కండలు తిరిగిన శరీరంతో ఆయన కనిపించేవారు ఇలియా. ఆన్ లైన్ లో ట్రైనింగ్ వీడియోలు పంచుకునే వారు. దీంతో అతనికి ఫాలోవర్స్ బాగా పెరిగిపోయారు. ఆయన భార్య అన్నా మాట్లాడుతూ.. ఆయనను బతికించాలని దేవున్ని ప్రార్థించాం.. కానీ రక్షించుకోలేకపోయాం. గుండెపోటు, బ్రెయిన్ డెడ్ తో ఆయన ఇంత చిన్న వయసులో కన్నుమూస్తారని ఎవరూ ఊహించలేకపోయారు. ఆయన కోసం ప్రార్థనలు, సంతాం వ్యక్తం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.