iDreamPost
android-app
ios-app

Director Passed Away: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ డైరెక్టర్ ఆత్మహత్మ!

  • Published Jul 21, 2024 | 10:40 AM Updated Updated Jul 21, 2024 | 10:40 AM

గత 20ఏళ్లుగా పరిశ్రమలో ఉన్న ప్రముఖ సీరియల్ కమ్ మూవీ డైరెక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

గత 20ఏళ్లుగా పరిశ్రమలో ఉన్న ప్రముఖ సీరియల్ కమ్ మూవీ డైరెక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

  • Published Jul 21, 2024 | 10:40 AMUpdated Jul 21, 2024 | 10:40 AM
Director Passed Away: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ డైరెక్టర్ ఆత్మహత్మ!

చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా తీవ్ర విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. నటీ, నటులు పలు కారణాలతో మరణిస్తూ.. అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా ఓ ప్రముఖ సీరియల్ కమ్ సినిమా డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటు సీరియల్స్ అటు సినిమాతో బిజీగా ఉండగానే ఇలా ఊహించని దారుణానికి పాల్పడ్డాడు సదరు డైరెక్టర్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

వినోద్ దొండాలే.. కన్నడ ఇండస్ట్రీలో ప్రముఖ సీరియల్ డైరెక్టర్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. గత 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న వినోద్ రాధే, కరిమణి, గంగే గౌరి లాంటి సీరియల్స్ తో పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘అశోక్ బ్లేడ్’ అనే సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇంత బిజీగా ఉన్న ఆయన శనివారం నాగరబావిలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాడీని పోస్ట్ మార్టం కోసం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే ఆయన మరణానికి గల కారణాలు తెలుస్తాయి.

ఇదిలా ఉండగా.. శుక్రవారం అశోక్ బ్లేడ్ మూవీ హీరో సతీష్, నిర్మాతతో షూటింగ్ గురించి చర్చించినట్లు సమాచారం. ఆ తర్వాత రోజే వినోద్ చనిపోవడం పలు అనుమానాలకుదారితీస్తోంది. అయితే నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన వినోద్ కు ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఎక్కువ అయ్యాయని చెబుతున్నారు. ఆ అప్పుల బాధలు తట్టుకోలేకే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో పేర్కొన్నారు. 20 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి.. వినోద్ ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో సన్నిహితులను, పరిశ్రమను దిగ్బ్రాంతికి గురిచేస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet