iDreamPost
android-app
ios-app

“ఉస్తాద్” ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా!

  • Published Sep 21, 2022 | 5:44 PM Updated Updated Sep 21, 2022 | 5:44 PM
  • Published Sep 21, 2022 | 5:44 PMUpdated Sep 21, 2022 | 5:44 PM
“ఉస్తాద్” ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా!

స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన వెందు తానిందతు కాదు (తెలుగు లో లైఫ్ ఆఫ్ ముత్తు) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అటు తమిళం లోనే కాకుండా..ఇటు తెలుగులో కూడా సూపర్ హిట్ టాక్ ని సాధించి తమిళ నటుడు శింబు కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ ని జత చేసింది ఈ చిత్రం.

ఇక “లైఫ్ ఆఫ్ ముత్తు” సినిమా ప్రమోషన్ లో భాగంగా డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తన తదుపరి చిత్రం టాలీవుడ్ ఉస్తాద్ రామ్ పోతినేనితో ఉంటుందని ప్రకటించారు. తెలుగు ఇండస్ట్రీలో క్లాసిక్ సినిమాలకి పెట్టింది పేరైన ‘శ్రీ స్రవంతి మూవీస్’ పతాకంపై స్రవంతి రవికిషోర్ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుందని సమాచారం. మంచి సమయం చూసి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికార ప్రకటన చేయనున్నట్టు వెల్లడించారు నిర్మాత ‘స్రవంతి’ రవికిషోర్.

ఇప్పటికే ఈ సినిమాపై ఫాన్స్ తో పాటు సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. గౌతమ్ మీనన్ టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన స్టైల్ ఆఫ్ టేకింగ్ కి మాస్ ఎనర్జీకి బ్రాండ్ అంబాసిడర్ గా పేరున్న ఉస్తాద్ రామ్ పోతినేని తోడైతే ఆ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుందో ఫాన్స్ ఇప్పటినుండే లెక్కలేస్తున్నారు. నిర్మాణ విలువల్లో ఏ మాత్రం రాజీ పడని స్రవంతి రవికిషోర్ ఈ సినిమాని హై స్టాండర్డ్స్ తో తెరకెక్కించే పనిలో ఉన్నారు.

బోయపాటి రామ్ ముచ్చట్లు


ప్రస్తుతం రామ్ పోతినేని తన తదుపరి చిత్రం మాస్ బ్లాక్ బస్టర్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బోయపాటి శీనుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. బాలకృష్ణ ‘అఖండ’ చిత్రంతో భారీ విజయాన్ని అందించి తన సత్త చాటిన బోయపాటి శీను, తాను చేస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై ఫాన్స్ లోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఉస్తాద్ రామ్ పోతినేని ఫ్యాన్స్ కి ఇది డబుల్ బొనాంజా అని చెప్పొచ్చు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş