Dharani
Dharani
నేటి కాలంలో అన్నింటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇంధన ధరలు.. బంగారంతో సమానంగా దూసుకుపోతున్నాయి. ప్రతి నెల ప్రారంభంలో చమురు కంపెనీలు గ్యాస్ ధరలను మారుస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు గ్యాస్ ధరలు పెరగడమే తప్ప.. తగ్గింది లేదు. ఈ క్రమంలో తాజాగా గ్యాస్ సిలిండర్‌కు సంబంధించి.. బంపరాఫర్ ఒకటి జనాల ముందుకు వచ్చింది. కేవలం రూ. 150కే గ్యాస్ సిలిండర్ పొందవచ్చు. అదేంటి ప్రస్తుతం గ్యాస్ ధర 1200 రూపాయల వరకు ఉంది కదా.. మరి ఏకంగా వెయ్యి రూపాయలకు పైగా తగ్గింపు ఎలా లభిస్తుంది అంటే.. ఇది చదివితే తెలుస్తుంది.
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1150 ఉంది. కానీ పేటీఎం ద్వారా సిలిండర్ బుక్ చేస్తే.. కేవలం 150 రూపాయలకే గ్యాస్ పొందవచ్చు. పేటీఎంలో గ్యాస్ బుక్ చేస్తే.. రూ. 1000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దాంతో కేవలం రూ.150కే గ్యాస్ సిలిండర్ పొందవచ్చు. ఇందుకోసం మీరు పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసే సమయంలో ఫ్రీగ్యాస్ అనే కూపన్ కోడ్ అని వాడాల్సి ఉంటుంది. అయితే ఈ ఆఫర్ అందరికి వర్తించదు. ప్రతి 1000వ కస్టమర్‌కు మాత్రమే వర్తిస్తుందని పేటీఎం పేర్కొంటోంది. అందువల్ల అందరికీ క్యాష్ బ్యాక్ లభించపోవచ్చు. అందువల్ల కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.
మీకు ఫ్రీగ్యాస్ వర్తించలేదు అంటే.. ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా కూడా మీకు ఎంతో కొంత క్యాష్‌బ్యాక్ వస్తుంది. మీరు కనక ఏయూ క్రెడిట్ కార్డు ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ. 50 తగ్గింపు వర్తిస్తుంది. అలాగే లక్కీగ్యాస్15 అనే ప్రోమో కోడ్ వాడితే రూ.10 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇంకా పోస్ట్‌పెయిడ్15 అనే ప్రోమో కోడ్ వాడితే రూ. 15 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
ఇంకా సిలిండర్ క్యాష్‌బ్యాక్ అనే కోడ్ వినియోగిస్తే.. సుమారు 100 క్యాష్‌బ్యాక్ పాయింట్లు వస్తాయి. అలాగే సిలిండర్50సీబీపీకోడ్ వాడినా కూడా క్యాష్ బ్యాక్ పాయింట్లు లభిస్తాయి. అందువల్ల మీకు నచ్చిన ప్రోమో కోడ్‌ను వాడొచ్చు. అదనపు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఈ డీల్స్ కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కనుక మీ లక్ పరీక్షించుకొండి.