iDreamPost
android-app
ios-app

చెత్తబుట్టలో రూ. 56 లక్షల విలువైన బంగారం..

అలాగే భారత్‌లో బంగారం ధరలు పెరగడంతో అక్రమ మార్గంలో విదేశాల నుండి పసిడిని దిగుమతి చేసుకుంటున్నారు స్మగ్లర్స్. ఇటీవల కాలంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిలోల కొద్దీ బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు.

అలాగే భారత్‌లో బంగారం ధరలు పెరగడంతో అక్రమ మార్గంలో విదేశాల నుండి పసిడిని దిగుమతి చేసుకుంటున్నారు స్మగ్లర్స్. ఇటీవల కాలంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిలోల కొద్దీ బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు.

చెత్తబుట్టలో రూ. 56 లక్షల విలువైన బంగారం..

నేటి సమాజంలో డబ్బు, బంగారం హోదాగా మారిపోయిన నేపథ్యంలో వీటి కోసం అడ్డదారులు తొక్కుతున్నారు కొంత మంది. అక్రమ మార్గాల్లో పయనిస్తూ డబ్బు సంపాదనే థ్యేయంగా బతికేస్తున్నారు. అలాగే భారత్‌లో బంగారం ధరలు పెరగడంతో అక్రమ మార్గంలో విదేశాల నుండి పసిడిని దిగుమతి చేసుకుంటున్నారు స్మగ్లర్స్. ఇటీవల కాలంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిలోల కొద్దీ బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. వాటిని బిస్కట్లు, పేస్టులు, రేకులు రూపంలోనే కాకుండా క్యాప్సుల్స్, బూట్లు, శరీరంలోని పలు భాగాల్లో దాచేస్తూ అక్రమంగా తరలిస్తుండగా.. కస్టమ్స్ అధికారులు పట్టుకున్న ఘటనలు అనేకం చూశాం. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడు ఓ చీరలో బంగారం స్ప్రే చేసి దాన్ని ఓ బాక్సులో భద్రపరిచి తరలిస్తుండగా.. కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన సంగతి విదితమే.

తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణీకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుండి బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణీకుడు.. 933 గ్రాముల బంగారం బిస్కెట్లను వెంట తెచ్చాడు. దీని విలువ సుమారు 56 లక్షలు. కస్టమ్స్ తనిఖీలకు రాకముందు అరైవల్‪లో ఉన్న వాష్ రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడే ఉన్న ఓ చెత్త డబ్బాలో ఆ మొత్తం బంగారాన్ని వేసి యథాతథంగా కస్టమ్స్‌ తనిఖీలకు వచ్చాడు. అయితే తనిఖీల్లో ఏమీ దొరక్కపోయినా.. అతడి ప్రవర్తన అనుమానంగా తోచడంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. మొత్తం విషయం కక్కేశాడు. ఆ బంగారాన్ని చెత్తడబ్బాలో వేశానని, దాన్ని ఎయిర్ పోర్టు ఉద్యోగి బయటికి తీసుకెళ్లినట్లు చెప్పడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ ఉద్యోగిని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 933 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిని పోలీసులకు అప్పగించారు.